ఏపీ మున్సిపల్ పోరు : 7,263 నామినేషన్ల ఉపసంహరణ!

open secret how consensus can be reached in panchayat elections

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మునిసిపల్ ఎన్నికలు జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మంగళ, బుధవారాల్లో ఏకంగా 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లా నుంచి పెద్దమొత్తంలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది.

ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 12 నగరపాలక, 75 పురపాలకలతోపాటు 8,787 మంది నగర పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం నిన్ననే ప్రకటించాల్సి ఉన్నా విజయవాడ, విశాఖపట్టణం నగర పాలక సంస్థల్లో లెక్కల విషయంలో జాప్యం జరగడంతో జాబితా ప్రకటించలేకపోయారు. పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఈసీ నేడు వెల్లడించే అవకాశం ఉంది.

బుధవారం ముగిసిన ఉపసంహరణల ప్రక్రియ అనంతరం మొత్తం 578 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 570 చోట్ల.. టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో చోట ఏకగ్రీవమయ్యారు.చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ ఆధిఖ్యం కొనసాగుతోంది. కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు సింగిల్‌ నామినేషన్లు వేశారు