అందివచ్చిన అవకాశం… కొద్ది నిమిషాలే మిగిలి ఉంది…చంద్రబాబు ‘చివరి’ ప్రయత్నం!

 CAG report on Chandrababu Naidu's debts

ఆంధ్రప్రదేశ్‌లో మరికాసేపట్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. ఈ తరుణంలో తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ట్వీట్లు చేశారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికలు అందివచ్చిన అవకాశం. పోలింగ్ పూర్తవడానికి ఇంకా కొద్ది నిమిషాలే మిగిలి ఉంది. ఇంకా ఓటు వేయనివాళ్లు వెంటనే వెళ్లి ఓటు వేసి రండి. ఓటు మన హక్కు. వృథా కానివ్వకండి’’ అని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Chandrababu threatening voters
Chandrababu threatening voters?

అలాగే ‘‘మీ ఓటే మీ భవిష్యత్తు. మీ హక్కు. మీ ఒక్క ఓటు అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించవచ్చు. అందుకే ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇంకా ఓటువేయని వాళ్లు వెంటనే పోలింగ్ బూత్‌కు వెళ్లి మీ ఓటు వేసి రండి! ఎందుకంటే ఇంకొద్ది నిమిషాల్లో పోలింగ్ ముగిసిపోతుంది.’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు, లోకేష్ శక్తివంచన లేకుండా కష్టపడ్డారు. ఈ తరుణంలో టీడీపీ భవిష్యత్తును ఓటర్లు నిర్ణయించనున్నారు.

ఇక, పురపాలక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌ తుదిదశకు చేరుకుంది. ఏలూరు కార్పొరేషన్‌, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపడంతో రాష్ట్రంలోని 12 నగర పాలక సంస్థల్లోని 581 డివిజన్లు, 71 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల్లోని 1,633 వార్డులలో పోలింగ్ జరుగుతోంది.