పర్సనల్ లోన్ విభాగంలో కొత్త రికార్డులు సృష్టించిన ఎస్బీఐ!

sbi account can be opened without any documents

భారత దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు అనుగుణంగా ఎన్నో వెసులుబాటులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎస్బిఐ ఎంతోమంది కష్టమర్లను ఆకట్టుకున్నారని చెప్పాలి. ఇకపోతే వ్యక్తిగత రుణాల పోర్ట్ ఫోలియా నవంబర్ 30వ తేదీ ముగియడంతో నవంబర్ 30 నాటికి ఐదు లక్షల కోట్ల మార్క్ అధిగమించినట్టు ఓ ప్రకటనలో తెలియజేశారు. పెన్షన్ విద్య బంగారం పోర్ట్ఫోలియాలో భాగంగా గత ఏడాది లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్లు తెలిపారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు, వ్యూహాత్మక చర్యలు, మెరుగైన ఆదాయం ఉన్న వారిపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఐదు లక్షల కోట్ల మార్క్ దాటామని ఎస్బిఐ వెల్లడించారు. ఇది ఎస్బిఐ చరిత్రలోనే ఓ మైలురాయి అంటూ ఎస్బిఐ చైర్మన్ దినేష్ ఖార ఓ ప్రకటనలో తెలియజేశారు. 2015 వ సంవత్సరంలో మొదటిసారి వ్యక్తిగత లోన్ విషయంలో లక్ష కోట్ల మార్క్ చేరుకుంది. ఇలా 2021 నవంబర్ 30 నాటికి ఐదు లక్షల కోట్ల మార్క్ చేరుకున్నట్లు ఎస్బిఐ వెల్లడించారు.

ఇక ఈ ఫోర్ట్ పోలియోలో గృహ రుణాలు ఉండవు. ఇక ప్రత్యేకించి గృహ రుణాల విభాగంలో ఎస్బిఐ 2021 జనవరి నాటికి ఐదు లక్షల కోట్ల మార్కు చేరుకోవడం విశేషం ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ దాదాపు ఏడు కోట్ల మార్క్ దాటితోందని అయితే వచ్చే సంవత్సరాలలో ఏడు కోట్లు కాస్త పది కోట్లకు చేరుతుందని బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు.స్టాంప్ డ్యూటీ సబ్సిడీ వంటి అంశాలు కూడా గృహ రుణాల పోర్ట్ఫోలియో కిందకు వస్తాయని వెల్లడించారు.