స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI ) దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ. ఈ ఎస్ బి ఐ కస్టమర్లకు ఎన్నో సదుపాయాలను అందిస్తోంది. ఆధునిక సాంకేతిక తక్కువ అనుగుణంగా వివిధ సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల వాట్సాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసే సతపాయాన్ని కూడా వినియోగదారులకు కలగజేసింది. అయితే ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ విధానం పెరగటం వల్ల ఏటీఎం కార్డు వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు కూడా ఎస్బీఐ పరిమితి విధించింది. ఏటీఎం ద్వారా బ్యాంక్ విధించిన నిర్దిష్ట పరిమితికి మించిన లావాదేవీలకు అదనపు చార్జ్ విధించబడుతుంది.
అయితే ఇటీవల కాలంలో ఏటీఎం వాడకం తగ్గిపోవడం వల్ల ఏటీఎం ద్వారా పరిమితికి మించి డబ్బులు డ్రా చేయడం లేదు. అయినప్పటికీ ఎస్బిఐ ఖాతాదారుల అకౌంట్ నుండి రూ. 147.5 కట్ చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులు కట్ చేయటానికి కూడా ఒక కారణం ఉంది. SBI తన కస్టమర్లకు క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ వంటి అనేక రకాల కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డుల నిర్వహణకుగాను బ్యాంకు ఒక సంవత్సరానికి రూ.125 వసూలు చేస్తుంది. ఈ మొత్తం సర్వీస్ ఛార్జీపై 18% GST వర్తిస్తుంది. ఇలా రూ.125కి 18% జీఎస్టీ అంటే రూ.22.5. కలిపితే మొత్తం రూ. 147.5. కట్ చేస్తారు.
అలాగే యువ, గోల్డ్, కాంబో, మై కార్డ్ (ఇమేజ్) డెబిట్ కార్డ్‌లపై సంవత్సరానికి 175 + GST వసూలు చేయబడుతుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డుపై ఏడాదికి 250. +GST వసూలు చేస్తుండగా… ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డ్‌లపై 350. +GST వసూలు చేయబడుతుంది.ఒక వేళ డెబిట్ కార్డ్‌ని మార్చుకోవాలనుకుంటే బ్యాంక్ 300+GST వసూలు చేస్తుంది.