సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేరాలనుకునే వారికి గుడ్ న్యూస్..?

ప్రస్తుత కాలంలో ప్రజలు కొన్ని రకాల స్కీం లలో భవిష్యత్తు కోసం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి వంటి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వివిధ రకాల స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల భవిష్యత్తులో పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి స్కీం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 10 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది.

10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆడపిల్లలు ఈ స్కీం లో చేరే అర్హత కోల్పోతారు. అయితే సుకన్య సమృద్ధి స్కీమ్ లో చేరాలనుకునే వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తెలిపింది. సుకన్య సమృద్ధి స్కీమ్‌ను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో కొత్త రిజిస్ట్రేషన్లను ప్రోత్సహించడానికి కేంద్రం కీలక ప్రతిపాదన చేసింది. ఇదివరకు సుకన్య సమృద్ధి స్కీం లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాప వయసు 10 సంవత్సరాలలోపు ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలో భాగంగా ఈ సుకన్య సమృద్ధి స్కీం లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 10 నుండి 12 సంవత్సరాల వరకు వయసు పరిమితి పెంచినట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు భర్తీ కోసం ఎక్కువగా స్మాల్ సేవింగ్ స్కీమ్స్ పైనే ఆధార పడింది. ఈ మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం లో చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా కేంద్రం రూ. 5 లక్షల కోట్లు పొందే అవకాశం ఉంది. ఈ క్రమంలో 12 సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి స్కీం లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ స్కీము ద్వారా 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్లో ఈ విషయం పై క్లారిటీ ఇవ్వనుంది.