SBI కస్టమర్స్ కి గుడ్ న్యూస్… మినీ స్టేట్మెంట్ కావాలా జస్ట్ మిస్సేడ్ కాల్ చాలు!

sbi account can be opened without any documents

దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రజలకు అనేక సేవలు అందిస్తోంది. కస్టమర్స్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విధానాలను అమలులోకి తీసుకువచ్చి ఎస్బిఐ తన కస్టమర్లకు అనేక సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎస్బిఐ తాజాగా తమ కస్టమర్ల కోసం మరొక వెసులుబాటును కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

మనకు మన బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన మినీ స్టేట్మెంట్ కావాలి అంటే తప్పనిసరిగా ఏటీఎం లేదా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది ఇలా బ్యాంకుకు వెళితే కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి రద్దీ కారణంగా అధికారులు మనకు మినీ స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితులు కొన్నిసార్లు ఏర్పడవు ఇలా మినీ స్టేట్మెంట్ కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారా అయితే ఇకపై ఇలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పాలి మనకు మినీ స్టేట్మెంట్ కావాలి అంటే ఇంట్లో కూర్చొని మిస్డ్ కాల్ ద్వారా మినీ స్టేట్మెంట్ పొందవచ్చు.

ఎస్బీఐ క్విక్ బ్యాంకింగ్, మిస్డ్ కాల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి విధానాల ద్వార మినీ-స్టేట్‌మెంట్‌ను పొందవచ్చు. ఈ సేవల కోసం
కస్టమర్స్ వారి ఫోన్ నెంబర్ ని అకౌంట్ కి లింక్ చేయించుకోవలసి ఉంటుంది. అప్పుడే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. NEFT, RTGS, IMPS, UPI వంటి వివిధ మోడ్‌ల ద్వారా నిర్వహించబడే అన్ని ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ ఉంటాయి.
ఎస్బిఐ కస్టమర్ వారి అకౌంట్ బ్యాలెన్స్ వివరాల గురించి తెలుసుకోవటానికి ఎస్బీఐ టోల్-ఫ్రీ నంబర్ 9223766666 కాల్ చేసి . అకౌంట్ బ్యాలెన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఎస్బిఐ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయడం ద్వారా బ్యాలెన్స్ వివరాల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు. అంతేకాకుండా
09223866666 ఎస్బిఐ నంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి మీరు జరిపిన గత 5 లావాదేవీలకు సంబంధించిన మినీ స్టేట్ మెంట్ వివరాల గురించి పూర్తి సమాచారం పొందవచ్చు.