ఎస్బిఐ కస్టమర్లకి గుడ్ న్యూస్… రూ. 32 లక్షల సూపర్ స్కీమ్..?

sbi account can be opened without any documents

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థల్లో ఒకటి అయినా ఎస్బిఐ తన కస్టమర్ల కోసం ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్స్ ద్వారా కస్టమర్ల మంచి లాభం పొందుతున్నారు. ప్రజలు కూడా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారికి నచ్చిన స్కీమ్స్ లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా వివిధ రకాల స్కీమ్స్ తో పాటు ప్రత్యేకమైన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ని స్టేట్ బ్యాంక్ ఇస్తోంది. స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ లో చేరితే అదిరే బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఎస్‌బీఐ సర్వోత్తం పేరుతో టర్మ్ డిపాజిట్ సర్వీసెస్ ని ప్రవేశపెట్టింది. ఈ స్కిన్ ద్వారా కస్టమర్లు మరింత ఆదాయం పొందవచ్చు. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్బిఐ ప్రవేశపెట్టిన సర్వోత్తమ్ టర్మ్ డిపాజిట్ స్కీం రెండు రకాల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఒకటి నాన్ క్యాలబుల్. ఇంకోటి క్యాలబుల్. ఇలా రెండు ఆప్షన్లు ఉన్నాయి. నాన్ క్యాలబుల్ ఆప్షన్ ని ఎంచుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు ఎక్కువ వడ్డీ వస్తుంది. ఈ తరహా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.9 శాతం వడ్డీని పొందొచ్చు. అయితే ఇది రెండేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలకు వర్తిస్తుంది. ఇది సీనియర్ సిటిజన్స్ కి, రెగ్యులర్ కస్టమర్ల కి అయితే 7.4 శాతం వస్తుంది. ఏడాది టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 7.6 శాతం వడ్డీ వస్తుంది. రెగ్యులర్ కస్టమర్లు అయితే వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది.

ఇక రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లపై కూడా ఎస్బిఐ వడ్డీ రేటు ని పెంచేసింది . సీనియర్ సిటిజన్స్‌కు రెండేళ్ల నుంచి పదేళ్ల టెన్యూర్‌ లోని ఎఫ్‌డీలపై 7.5 శాతం వడ్డీ వస్తోంది. ఇవే కాకుండా ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్ కూడా వుంది. అమృత్ కలాష్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో సీనియర్ సిటిజన్స్‌కు 7.6 శాతం వడ్డీ వస్తోంది. రెగ్యులర్ కస్టమర్లకు అయితే 7.1 శాతం వడ్డీ వస్తుంది. సర్వోత్తం ఎఫ్‌డీ స్కీమ్‌లో డబ్బులు పెట్టాలంటే కనీసం రూ. 15 లక్షల మినిమం ఇన్వెస్ట్ చేయాలి. ఇలా 15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే పదేళ్లలో వడ్డీ తో కలిపి చేతికి రూ. 32 లక్షలు వస్తాయి. అయితే దీని టెన్యూర్ 2 ఏళ్లు వరకే ఉంటుంది.