దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ – SBI) తాజాగా తన కస్టమర్లకు ఒక శుభవార్త తెలియజేసింది. ఇప్పటికే ఎన్నో స్కీమ్స్ ప్రవేశపెట్టి వాటి ద్వారా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్న ఎస్బిఐ తాజాగా మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ వాహన తయారీ సంస్థ మోటార్స్‌కు (Tata Motors) చెందిన టాటా ఏస్ ఈవీ వాహన కొనుగోలుకు ఎస్బిఐ రుణాలు ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎస్బిఐ కస్టమర్లు టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేయాలని భావిస్తే.. సులభంగానే రుణం పొందొచ్చు. టాటా మోటార్స్ తాజాగా ఎస్బీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎస్బీఐ టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈజీగా లోన్స్ అందించనుంది. టాటా ఏస్ ఈవీ అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. సాధారణంగా బ్యాంకు నుండి రుణం తీసుకోవాలంటే విలువైన వస్తువులను ఇంటి పత్రాలు వంటి వాటిని తనక పెట్టాల్సి ఉంటుంది . కానీ టాటా మోటార్స్, ఎస్బీఐ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా కస్టమర్లు టాటా మోటార్స్ కి సంబంధించిన ఎస్ ఈవి వాహనం కొనుగోలు చేయడానికి ఎలాంటి తనఖా లేకుండా సులభంగా లోన్ పొందొచ్చు. అయితే తీసుకున్న రుణాన్ని ఆరేళ్ల లోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్ లో టాటా ఏస్ ఈవీ ధర రూ. 9.99 లక్షల నుంచి ఉంది. అంటే ఈ వాహనాన్ని కోనుగోలు చేయటానికి మీకు బ్యాంక్ 90 శాతం ఫైనాన్స్ కల్పిస్తుంది. అంటే ఎటువంటి షురిటీ లేకుండా దాదాపు 8.99 లక్షల దాకా లోన్ పొందొచ్చు. ఇది ఎస్బిఐ కస్టమర్లకు శుభవార్త అనే చెప్పాలి. టాటా ఏస్ ఈవీ కొనుగోలు చేసి ఉపాధి పొందాలని భావించే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. కేవలం లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఇంటికి టాటా ఏస్ ఈవీ తెచ్చుకోవచ్చు. చేతిలో డబ్బులు లేని వారు ఈ ఆఫర్ పొందొచ్చు. టాటా మోటార్స్ వెబ్సైట్లోకి మీరు టాటా ఏస్ ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత లోన్ పొందవచ్చు.