స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ ఎన్నో స్కీమ్స్ ని అమలులోకి తీసుకువచ్చి తన వినియోగదారులకు ఎన్నో సేవలు అందిస్తోంది. ఎస్బిఐ అందిస్తున్న స్కీమ్స్ ద్వారా కస్టమర్లు కూడా అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోవటంతో ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు పొరపాటున ఇతరులకు డబ్బు పంపడం వల్ల నష్టపోతున్నారు. అలాగే వీటి ద్వారా బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మోసగాళ్ల చేతికి వెళ్తున్నాయి. అందువల్ల కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని ఎస్బిఐ సూచిస్తుంది.
ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్లు మెసేజీలు పంపించి ఆ లింక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. అందువల్ల వినియోగదారులు అటువంటి నకిలీ సందేశాలకు స్పందించకూడదని హెచ్చరించింది బ్యాంకు. ఇటువంటి మెసేజ్ లకి స్పందించడం వలన మోసానికి గురవుతారు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కొన్ని సందర్భాలలో ”మీ YONO ఖాతా బ్లాక్ చేయబడుతుంది దయచేసి మీ పాన్ కార్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి” అని సైబర్ నేరగాళ్లు మెసేజ్ లు పంపుతున్నారు. కొంతమంది కస్టమర్లు అవి నిజం అనుకొని భావించి వాటి మీద క్లిక్ చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల అనేకమంది మోసపోతున్నారు.
అందువల్ల కస్టమర్లు బ్యాంకింగ్ వివరాలని ఇతరులతో షేర్ చేయకూడదు. అలానే ఈమెయిల్ ఎస్ఎంఎస్ లకి ఎప్పుడు స్పందించకూడదని ఎస్బిఐ హెచ్చరించింది . ఒకవేళ కనుక మీకు ఇలాంటి మెసేజ్లు వస్తే వెంటనే report.phishing@sbi.co.in’కి రిపోర్ట్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం ఖాతా నెంబర్లు పాస్వర్డ్ లేదా ఇతర ముఖ్యమైన విషయాలని ఎవరితోనూ పంచుకోకూడదు. అలానే మెసేజ్ వస్తే స్పందించకూడదు. ఏమైనా మెసేజ్లను వస్తే వాటికి అస్సలు స్పందించకూడదని ఎస్బిఐ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది.