ఎస్బీఐ సూపర్ పాలసీ.. రోజుకు రూ.100 తో ఏకంగా రూ.2 కోట్లు పొందే ఛాన్స్!

sbi-3-1-2-167419588016x9

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఎన్నో పాలసీలను అందిస్తుండగా ఎస్బీఐ పాలసీలలో డిపాజిట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. ఎస్‌బీఐ లైఫ్ పూర్ణ సురక్ష పాలసీ ఎస్బీఐ కస్టమర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైతే ఈ పాలసీ తీసుకుంటారో వాళ్లకు ప్రయోజనం చేకూరడంతో పాటు రిబేట్ బెనిఫిట్ ను పొందవచ్చు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ పాలసీ తీసుకోవచ్చు.

పాలసీ టర్మ్ 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండగా 20 లక్షల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు బీమా మొత్తానికి పాలసీని తీసుకోవచ్చు. 30 ఏళ్ల వ్యక్తి 2.5 కోట్ల రూపాయలకు పాలసీ తీసుకుంటే సంవత్సరానికి 36,000 రూపాయలు చెల్లించాలి. రోజుకు 100 రూపాయలు ఆదా చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సులువుగా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్నవాళ్లు ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ ప్రత్యేక పాలసీ కాగా ఈ పాలసీ ఎంతోమందికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. 250 రూపాయల నుంచి 80,000 వరకు ప్రీమియం ఉంటుంది. సమీపంలోని బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

దీర్ఘకాలంలో బెనిఫిట్ పొందాలని భావించే వాళ్లు ఈ పాలసీని తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈ స్కీమ్ ద్వారా పొందే మొత్తంపై ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు.