ఈ మధ్యకాలంలో భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ డిమాండ్ పెరిగిపోవడంతో పెద్ద మొత్తంలో వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఒకదానిని మించి మరొకటి అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే కారు కూడా ఒకటి. ఈ కారు ఒకసారి చార్జ్ చేస్తే చాలు ఏకంగా 300 కిలోమీటర్లు ప్రయాణించవచ్చట. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఫీచర్లు లాంటి వివరాల్లోకి వెళితే.. భారతదేశంలో సౌత్ ఇండియాలో మొదటిసారిగా జాతీయ రహదారి 65 నెంబర్ పై వాల్ట్రాన్ ఎలక్ట్రానిక్ హబ్ సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు.
ఈ ప్రతిరోజు 24 * 7 ఓపెన్ ఉంటుంది. అయితే రానున్న ఆరు నెలల్లో పది ఎలక్ట్రానిక్ హబ్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లా జాతీయ రహదారి 65 నెంబర్ కి అనుకోని సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో వాల్ ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. సౌత్ ఇండియాలోనే మొదటి వాల్ ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వల్ల ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులు కూడా ఆదా అవుతున్నాయి. అదే విధంగా డ్రైవింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది.
సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో వాల్ ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్ ఒక్కటే ఉండేది. కానీ రానున్న ఆరు నెలల్లో 10 వాల్ ట్రైన్ ఎలక్ట్రానిక్ హబ్లు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేయబోతున్నాము. గతంలో ఎలక్ట్రానిక్ హబ్ లేక లోకల్ లో తిప్పుకునేవాళ్లు కానీ ఇప్పుడు హబ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లేవాళ్లు సెంటర్ పాయింట్ ఉండడం వల్ల ఇక్కడ చార్జ్ చేసుకుని వెళ్తున్నరు. మాములుగా ఒక వెహికల్ కి ఫుల్ గా ఛార్జ్ చేయాలంటే కనీసం 4 గంటల సమయం పడుతుంది. ఒక కిలో వాట్స్ వచ్చేసి జీఎస్టీ తో కలుపుకొని 24 రూపాయలు ఖర్చవుతుంది. అలాగే ఈ కారుని ఒక్కసారి ఫుల్ గా ఛార్జ్ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇక్కడ ఫ్రీ వైఫై తో పాటు క్యాంటీన్ కూడా అదే విధంగా వెయిటింగ్ హాలు అందుబాటులో ఉంటాయి అని ఆయన చెప్పు కొచ్చారు.