ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం వలన అనేక సరికొత్త టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు వంటి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. సాధారణంగా స్మార్ట్ వాచ్లు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. దీంతో ఈ స్మార్ట్ వాచ్ లకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతోంది. వీటికి డిమాండ్ పెరగటం వల్ల కొత్త కొత్త ఫీచర్లతో ఈ స్మార్ట్ వాచ్ లను తయారుచేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఇక ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థల దిగ్గజం అయిన హ్వావే కంపెనీ యూకే, యూఎస్ఏలో వంటి దేశాలలో అగ్రగామిగా కొనసాగింది. కానీ, తర్వాత ట్రంప్ హయాంలో ఈ కంపెనీ తన ప్రాభవాన్ని చాలా వరకు కోల్పోయింది. ఇప్పుడు ఈ సూపర్ కూల్ స్మార్ట్ వాచ్ తో తిరిగి గట్టి పోటీ ఇవ్వనుంది.ఇప్పుడు హ్వావే వాచ్ బడ్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
సాధారణంగా మీరు బడ్స్ వాడాలి అంటే అందుకు సెపరేట్ కేస్ కావాలి. కానీ, ఈ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటే ఇయర్ బర్డ్స్ కోసం సెపరేట్ కేస్ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ స్మార్ట్ వాచ్ ఇయర్ బర్డ్స్ కేస్ గా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ లోనే ఇయర్ బడ్స్ ఇన్ బిల్ట్ గా ఉంటాయి. అందుకే వీటికి వాచ్ బడ్స్ అని పేరు పెట్టారు.ఈ వాచ్ బడ్స్ 2 ఇన్ 1 మోడల్ స్మార్ట్ వాచ్ ను మొదట చైనాలో లాంఛ్ చేశారు. ఆ తర్వాత యూరప్ లో కూడా దీనిని లాంచ్ చేశారు. ఇక ఈ వాచ్ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ వాచ్ 1.3 ఇంచెస్ డిస్ ప్లే, జీపీఎస్ సపోర్ట్, బ్లూటూత్ కాలింగ్, ఐపీ54 వాటర్ రెసిస్టెన్స్, డస్ట్ ప్రూఫ్, హార్ట్ రేట్ మోనిటర్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటర్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంట్, కేలరీ కౌంట్ వంటి హెల్త్ రిలేటెడ్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంది.
అంతేకాకుండా ఈ వాచ్ బడ్స్ 2 ఇన్ 1.. 410 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. అలగే ఈ వాచ్ లో వాచ్ ఫేసెస్, రొటేటింగ్ క్రౌన్ వంటి ఫీచర్లు చాలానే ఉన్నాయి. ఈ వాచ్ ధర విషయానికి వస్తే.. చైనా, యూరప్ లో దీనిని రూ.44 వేలకు అందుబాటులో ఉంది. అయితే ఎన్నో ఫీచర్స్ ఉన్న ఈ వాచ్ బడ్స్ లో డ్రా బ్యాక్స్ కూడా ఉన్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ వాచ్ బడ్స్ సైజ్ పరంగా చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ 410 ఎంఏహెచ్ బ్యాటరీలో బడ్స్ కి ఉపయోగ పడేది 30 ఎంఏహెచ్ మాత్రమే. ఆ ఛార్జింగ్ కెపాసిటీతో బడ్స్ 50 శాతం వాల్యూమ్ తో కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే పనిచేస్తాయని టెక్ నిపుణుల అభిప్రాయం.