వాచ్ ని ఎందుకు ఎడమ చేతికే పెట్టుకుంటారో తెలుసా.. అసలు కారణం ఇదే..!

సమయం తిరిగి రాదు అని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు. అందుకే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో అందరూ
వాచ్‌ లు, స్మార్ట్‌వాచ్‌లు వాడుతున్నారు. కొంతమంది గడియారాలను కేవలం సమయం కోసం కాకుండా, ఫ్యాషన్‌ స్టేట్మెంట్‌ కోసం కూడా చేతికి ధరిస్తారు.
ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. గడియారం ఎక్కువ మంది ఎడమ చేతికే ధరిస్తారు. కొందరు కుడి చేతికి పెట్టుకుంటారు కానీ అది చాలా అరుదు.

ఎడమ చేతికే ఎందుకు వాచ్ పెట్టుకుంటారు: దీనికి వెనక ఒక సరళమైన లాజిక్ ఉంది. ఎందుకంటే ఎక్కువమంది కుడిచేయి వాటంతో ఉంటారు. అంటే ఎక్కువ పనులు, ముఖ్యంగా రాయడం, టైప్‌ చేయడం, వంట చేయడం, డ్రైవింగ్‌ వంటి పనులు కుడిచేతితోనే చేస్తారు. కుడి చేయి ఎప్పుడూ బిజీగా ఉండటంతో, గడియారం ఎడమ చేతిలో ఉండటం వలన పనులు సౌకర్యంగా జరుగుతాయి. వాచ్‌కు ఎలాంటి డ్యామేజ్‌ కలగకుండా కూడా ఉంటుంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గడియారం ఎడమచేతిలో ఉంటే సమయం సులువుగా చూడచ్చు. కుడి చేతితో రాస్తూ ఉంటే ఎడమచేతిని తిప్పి తక్కువ కష్టంతో టైమ్ చూడచ్చు. అలాగే, గడియారం ఎలా పెట్టినా దాని డయల్‌లో 12 సంఖ్య ఎప్పుడూ పైవైపే ఉండాలి. గోడగడియారంలోలా… చేతిగడియారంలో కూడా అదే లాజిక్ ఉంటుంది. ఎడమచేతికి వాచ్‌ వేసుకుంటే ఆ సర్దుబాటు సరిగ్గా ఉంటుంది. కానీ కుడి చేతికి వేసుకుంటే డయల్‌ను చూసే కోణం మారి, టైమ్ చూడటం అసౌకర్యంగా ఉంటుంది. అందుకే ప్రపంచంలో చాలామంది ఎడమచేతికే వాచ్‌ ధరిస్తుంటారు.