ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు డిజిటల్ యాప్స్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్నారు.ఇలా డిజిటల్ యాప్స్ ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్న సమయంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతుండడంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి యూపీఐ పేమెంట్ విషయంలో కొన్ని పరిమితులను అమలులోకి తీసుకువచ్చింది.గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి థర్డ్‌పార్టీ యాప్స్ నుంచి యూపీఐ లావాదేవీలు నిర్వహించడం, ఈ యాప్స్ నుంచి లావాదేవీలు 30 శాతం మించి రాకూడదన్న దిశగా ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం.
ఇదే కనుక నిజమైతే డిజిటల్ యాప్స్ లో ఎన్నో మార్పులు ఏర్పడటమే కాకుండా నెలకు ఇంత అమౌంట్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేసే విధంగా పరిమితులు కూడా విధించనున్నట్లు తెలుస్తోంది.ఇలా డిజిటల్ పేమెంట్స్ యాప్స్ విషయంలో ఎన్నో నిబంధనలు పెట్టినప్పటికీ కొందరు ఎంతో సునాయసంగా మోసాలకు పాల్పడుతున్నారు.అయితే ఇలాంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా డబ్బులను పంపించేవారు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
మనం డిజిటల్ పేమెంట్ ఆప్స్ ద్వారా ఒక వ్యక్తికి డబ్బు పంపించాలంటే అవతలి వ్యక్తి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకొని ఉండాలి. ఇలా బ్యాంకు వివరాలు పూర్తిగా తెలిసిన అనంతరం ఫోన్ నెంబర్ ద్వారా మనం గూగుల్ పే ఫోన్ పే వంటి వాటి ద్వారా డబ్బును పంపించవచ్చు.మనం ఇలాంటి డిజిటల్ పేమెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు పూర్తిగా ఆ యాప్ గురించి తెలుసుకున్న అనంతరం అలాగే, ఈ ఆప్ రేటింగ్స్ తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యాప్స్ లాగిన్ కావడానికి ముందు కూడా ఎలాంటి నియమ నిబంధనలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మన డబ్బు ఎంతో భద్రంగా ఉంటుందని చెప్పాలి.