రూ.500 నోట్లు రద్దయ్యే అవకాశం ఉందా.. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేస్తుందా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను రద్దు చేసి ప్రజలకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అయితే త్వరలో 500 నోట్ల రూపాయలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. 2000 రూపాయల నోట్ల రద్దు వల్ల 500 నోట్ల కొరత సమస్యతో పాటు నకిలీ 500 నోట్ల రూపాయల సమస్య వేధిస్తోంది. అక్రమంగా డబ్బులను దాచుకునే వాళ్లు ఇప్పుడు 500 నోట్ల రూపాయలను ఎక్కువగా దాచుకుంటున్నారు.

పాకిస్తాన్, ఇతర దేశాల నుంచి ఈ 500 రూపాయల నోట్లు మన దేశంలోకి వస్తున్నాయని సమాచారం అందుతోంది. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న నోట్లలో ఏవి ఒరిజినల్ నోట్లో ఏవి దొంగ నోట్లో సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నకిలీ నోట్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే నోట్ల రద్దు చేయడం వల్ల నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.

2,000 నోట్లను రద్దు చేసినా కేవలం 20 శాతం నోట్లు మాత్రమే వెనక్కు వచ్చాయని సమాచారం. నోట్లను మార్పు చేసుకోవడానికి చాలా సమయం ఉండటంతో ఎక్కువమంది తర్వాత డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది పెట్రోల్ బంకులు, షాపింగ్ మాళ్లలో 2000 నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 2000 నోట్లు ఏ మేరకు రిటర్న్ అవుతాయో చూడాల్సి ఉంది.

2000 రూపాయల నోట్ల రద్దు వల్ల కొంతమందికి మాత్రం ఇబ్బంది కలుగుతోంది. వీటిని మార్చుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.