దేశంలో అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా వ్యవసాయ రంగం మాత్రం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. పంటలు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు అదిరిపోయే తీపికబురు అందించింది. రైతులకు బ్యాంకులు ఇచ్చే లోన్ లిమిట్ ను 2 లక్షల రూపాయలకు పెంచింది.
ఎలాంటి తనఖా అవసరం లేకుండా రైతులు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉండటం రైతులకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. రైతులు వ్యవసాయ రుణాలను తీసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకే రుణం లభిస్తుందని చెప్పవచ్చు. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
జనవరి 1వ తేదీ నుంచి బ్యాంకుల ద్వారా రుణం పొందే రైతులు ఈ బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. సమీపంలోని బ్యాంకులను సంప్రదించడం ద్వారా రైతులు సులువుగానే ఈ బెనిఫిట్స్ ను పొందవచ్చు. రైతులు ఏడాదికి ఒకసారి తీసుకున్న రుణాన్ని రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోవడం ద్వారా తక్కువ వడ్డీకే బెనిఫిట్స్ పొందవచ్చు.
కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం కొన్ని పథకాలను సైతం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఈ స్కీమ్స్ ద్వారా దీర్ఘకాలంలో బెనిఫిట్ పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.