ప్రస్థుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీంతో స్మార్ట్ ఫోన్ వాడకం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడించి స్మార్ట్‌ఫోన్లు తయారుచేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. అయితే టెక్నాలజీ ఎంత ఉపయోగించినా కూడా నెట్వర్క్ సరిగా లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. నెట్వర్క్ సరిగా లేకపోవడం,సెల్‌ఫోన్ టవర్లకు సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కాల్ డ్రాప్ సమస్య తలెత్తుతుంది. అటువంటి సందర్భంలో కాల్ కట్ అవడం లేదా అవతలి వ్యక్తి వాయిస్ సరిగ్గా వినిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.
అయితే నెట్వర్క్ సిగ్నల్స్ సరిగా లేని ప్రాంతాలలో కూడా కాల్ డ్రాప్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఒక అవకాశం ఉంది. కాల్ డ్రాప్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి వైఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. వై-ఫై కాలింగ్ ఉపయోగించటానికి వైఫై నెట్వర్క్ తప్పనిసరిగా ఉండాలి. వై-ఫై కాలింగ్ అనేది VoLTE (వాయిస్ ఓవర్ LTE) టెక్నాలజీకి బదులు VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) టెక్నాలజీని ఉపయోగించి కాల్స్ కనెక్ట్ చేస్తుంది. ఇటీవల మార్కెట్లోకి వస్తున్న అన్ని రకాల స్మార్ట్ ఫోన్ లలో వై-ఫై కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ ఆప్షన్ లేకపోతే వైఫై ద్వారా కాల్స్ చేయడం కుదరదు.
ఆండ్రాయిడ్ ఫోన్లలో వై-ఫై కాలింగ్ ఆప్షన్ యాక్టివేట్ చేయడం :
• ఆండ్రాయిడ్ ఫోన్‌లో వైఫై కాలింగ్ ఆప్షన్ ఆక్టివేట్ చేయడానికి సెట్టింగ్స్ మెనూకు వెళ్లాలి. తరువాత నెట్‌వర్క్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
• నెట్‌వర్క్ సెక్షన్‌కు వెళ్లిన తర్వాత వై-ఫై ప్రిఫరెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ తర్వాత అడ్వాన్స్‌డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
• వై-ఫై కాలింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. మీ ఫోన్‌లో రెండు సిమ్ కార్డులు ఉంటే.. వాటిలో మీకిష్టమైన సిమ్ కార్డుకి వైఫై కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు.
ఐఫోన్ లో వై-ఫై కాలింగ్ ఆప్షన్ యాక్టివేట్ చేయడం :
• ఐఫోన్ లో వైఫై కాలింగ్ ఆప్షన్ ఆక్టివేట్ చేయటానికి ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి ఫోన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత ‘మొబైల్ డేటా’ ఆప్షన్ పై క్లిక్ చేసి వై-ఫై కాలింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మీ టెలికాం ఆపరేటర్ సపోర్ట్ చేస్తేనే ఇందులో వైఫై కాలింగ్ ఫీచర్ కనిపిస్తుంది.
• వై-ఫై కాలింగ్ ఆన్ దిస్ ఐఫోన్ ఫీచర్ టర్న్ ఆన్ చేయాలి. ఈ ఫీచర్ ఆన్ చేశాక.. మీ ఫోన్‌లోని స్టేటస్ బార్‌లో టెలికాం ఆపరేటర్స్ నేమ్ కింద వై-ఫై అని కనిపిస్తుంది.