ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. ఈ క్రమంలో సరికొత్త టీచర్స్ తో వివిధ రకాల కంపెనీలు స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా 9 నిమిషాలలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యే స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రోజు మొత్తం స్మార్ట్ఫోన్ తోనే సమయం గడుపుతున్నారు. ఈ క్రమంలో ఫుల్ చార్జ్ చేసినా కూడా కొంత సమయానికే స్మార్ట్ ఫోన్లో చార్జింగ్ అయిపోతుంది. అయితే ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చార్జింగ్ కష్టాలు లేకుండా కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 9 నిమిషాలలో ఫుల్ చార్జ్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ వినియోగదారులను వేధిస్తున్న ఏకైక సమస్య ఛార్జింగ్. ఇప్పటికే చాలా కంపెనీలు స్పీడ్ ఛార్జెస్, లైటింగ్ ఛార్జింగ్ అని ఎన్ని ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లు తీసుకొచ్చాయి. అయితే వాటికి కూడా ఫోన్ ఫుల్ ఛార్జ్ కావాలంటే దాదాపు 2, 3 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో రియల్ మీ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలియజేసింది. రియల్ మీ సంస్థ తీసుకొచ్చిన ఈ రియల్ మీ జీటీ3 సూపర్ స్మార్ట్ ఫోన్ కేవంల 9.30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. కేవలం 9 నిమిషాల్లోనే ఫోన్ 100 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది.
ఈ రియల్ మీ జీటీ3 స్మార్ట్ ఫోన్ 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 250 వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ స్పీడ్ ఛార్జింగ్ కి సంబంధించి రియల్ మీ ఇటీవల ఓ వీడియో కూడా విడుదల చేసింది. ఆ వీడియో ప్రకారం.. కేవలం 80 సెకన్లలో 0 నుంచి 20 శాతం ఛార్జింగ్ ఎక్కింది. ఇక 4 నిమిషాల్లోనే ఫోన్ 50 శాతం ఛార్జ్ అయ్యింది. ఇక 9.30 నిమిషాల్లో ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోయింది. కేవల 9:30 నిమిషాలలో స్పీడ్ ఛార్జింగ్ అయ్యే ఫోన్ కేవలం రియల్ జీటీ3 మాత్రమే అని ఆ సంస్థ వెల్లడించింది. ఇక ఈ సుపర్ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఇండియాలో ఈ ఫోన్ రూ.34,500 ఆ రేంజ్ లో అందుబాటులో ఉంది.
We asked you to guess how long it takes the #240Wcharging #realmeGT3 to charge. Watch the video to see the results.
⚠️ Be warned, it’s gonna blow you away ⚠️
———————–#SpeedtotheMax pic.twitter.com/3C1cvBMi39— realme (@realmeIndia) February 20, 2023