అలసటను తగ్గించడానికి మరియు శక్తిని పెంచడానికి, మంచి నిద్ర పద్ధతులను అనుసరించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్కలంగా నీరు త్రాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం మరియు అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడం వంటి పలు చిట్కాలు ఉన్నాయి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది.
వయస్సును బట్టి నిద్రలో మార్పులు చేసుకోవాలి. సరైన నిద్ర వల్ల ఎన్నో సమస్యలను అధిగమించవచ్చు. వారంలో కనీసం 5 రోజులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నిద్ర పోవడానికి ముందు స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ప్రతిరోజూ తగినంత నీరు తాగడం వల్ల డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
క్రమం తప్పకుండా మూడు పూటలా ఆహారం తీసుకోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా అలసట సమస్య వేధించే అవకాశం ఉండదు. యోగా, ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు కొత్త ఉత్సాహంతో ముందడుగులు వేయవచ్చు. ఏరోజు చేయాల్సిన పనులను ఆరోజు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రాధాన్యత ఆధారంగా పనులు చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది.
అలసట చాలా ఎక్కువ ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు. వారు అలసటకు కారణాలను కనుగొనవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే కూడా ఈ సమస్య వేధించే ఛాన్స్ ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం చాలా మందికి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది.