ఫ్లిప్‌కార్ట్ మరోసారి టెక్ ప్రియులకు గొప్ప ఆఫర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్ పై సుమారు రూ.31,000 తగ్గింపు ప్రకటించడంతో, ఇప్పుడు ఇది రూ.75,999 స్థానంలో కేవలం రూ.44,999కే అందుబాటులో ఉంది. ఇది దాదాపు 40% డిస్కౌంట్ కావడంతో, హై-ఎండ్ ఫోన్ కోరుకునే వారికి ఇది ఒకరే అవకాశం అంటున్నారు నిపుణులు.
ఈ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై అదనపు క్యాష్‌బ్యాక్, నెలకు రూ.1,583 నుంచి ప్రారంభమయ్యే EMI ఎంపికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఇంకో తగ్గింపు కూడా పొందవచ్చు.
పిక్సెల్ 8 ఫీచర్లకు వస్తే, 6.2″ OLED 1080p స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ వంటి టాప్-ఎండ్ స్పెక్స్ ఇందులో ఉన్నాయి. కెమెరా పరంగా 50MP మెయిన్, 10.5MP ఫ్రంట్ కెమెరాలతో టాప్ క్వాలిటీ ఫోటోలు, AI ఆధారిత నైట్ మోడ్, స్కిన్ టోన్ ట్యూనింగ్ వంటి ఫీచర్లు ఉన్నారు.
పిక్సెల్ 8లో గూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, 4,575mAh బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన హార్డ్‌వేర్ ఉంది. సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, క్లియర్ కాలింగ్ వంటి AI ఫీచర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోన్‌కు గూగుల్ నుంచి 7 ఏళ్ల వరకు OS, సెక్యూరిటీ అప్‌డేట్లు అందనున్నాయి. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్, టైటాన్ M2 సెక్యూరిటీ చిప్, IP68 రేటింగ్ వంటి భద్రతా అంశాలు ఉన్న ఈ డివైస్, ఇప్పుడు బడ్జెట్‌లో అందుబాటులో ఉంది. టెక్ లవర్స్ ఇది మిస్ చేయరాదు.