మీ ఆధార్ కార్డ్ దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానాలు ఉన్నాయా…. ఇలా చెక్ చేయండి!

ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైన గుర్తింపు కార్డు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు ఆధార్ కార్డు ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైనా పథకాలకు లబ్ధి పొందాలన్నా లేదా ఇతరత బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే ప్రస్తుతం చాలామంది ఆధార్ కార్డులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అయితే మన ఆధార్ కార్డు దుర్వినియోగం చేస్తున్నారా అనే విషయాన్ని మనం సులభంగా తెలుసుకోవచ్చు.

ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేసారని సందేహం ఉంటే ఇలా కనిపెట్టచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆరు నెలల క్రితం నుంచి ఆధార్ హిస్టరీ ని తెలుసుకోవచ్చు ఒకేసారి మనం 50 రికార్డులను చూడవచ్చు మరి మన ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనే విషయానికి వస్తే…

మొదట మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ మీకు నచ్చిన భాష ఇంగ్లీషు లేదా తెలుగును ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం నా ఆధార్ విభాగానికి వెళ్లి డ్రాప్ అవుట్ మెనూ కనపడుతుంది దానిపై క్లిక్ చేయాలి. ఆధార్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
వెబ్ పేజీ వస్తుంది. అక్కడ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీను క్లిక్ చేయాలి.
ఓటీపీను ఎంటర్ చేసి ప్రోసీడ్ మీద నొక్కండి. ఇలా చేయటం వల్ల ఆధార్ వివరాలతో పాటు గత ప్రామాణికరణ అభ్యర్థనల వివరాలు కూడా వస్తాయి అయితే మీకు ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే ఈ విషయం గురించి ఫిర్యాదు చేయడానికి 1947 నెంబర్ కి కాల్ చేసి మీ సందేహాలను ఫిర్యాదు రూపంలో తెలియజేయవచ్చు.