యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు మరో తీపికబురు అందించింది. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలతో పాటు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జనవరి నెల 1వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. మొత్తం 10 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ప్రైవేట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్ లు ఒకటి చొప్పున భర్తీ కానుండగా నాలుగు టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, నాలుగు అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
56 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. . ఐఎస్‌టీఎంలో క్యాష్, అకౌంట్స్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
యూఐడీఏఐ, బంగ్లా సాహిబ్ రోడ్, కాళీ మందిర్ వెనుక, గోలే మార్కెట్, న్యూఢిల్లీ-110001 అనే అడ్రస్‌కు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 1,80,000 వరకు వేతనం లభించనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.