ఆధార్ కార్డుల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ కార్డులు రద్దవుతాయా?

29_05_2022-aadhar_227546831666951873071

మన దేశంలో నివశించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డ్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆధార్ కార్డ్ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే గతంలో రేషన్ కార్డ్ అర్హత కాగా ఇప్పుడు ఆధార్ కార్డ్ కచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

యూఐడీఏఐ కొత్త విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతుండగా ఇకపై మరణించిన వాళ్ల ఆధార్ కార్డులు వేగంగా రద్దు కానున్నాయి. చనిపోయిన వాళ్ల ఆధార్ కార్డ్ త్వరగా రద్దయ్యే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాతో యూఐడీఏఐ ఒప్పందం కుదుర్చుకుని ఈ విధానాన్ని అమలు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

డెత్ సర్టిఫికెట్ జారీ అయిన సమయంలోనే ఆధార్ కార్డ్ రద్దయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని ఆధార్ కార్డును రద్దు చేయడం జరుగుతుంది. మరణించిన వ్యక్తుల ఆధార్ కార్డుల వల్ల ఆ ఆధార్ కార్డులు మిస్ యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ నంబర్ ను సమర్పించడం ద్వారా మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ పని చేయదు. అదే సమయంలో మరణించిన వ్యక్తి ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హత కలిగి ఉండకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు ఈ విషయాలకు సంబంధించి అవగాహన కలిగి ఉండాలి.