ఆధార్ కార్డ్ ను పోగొట్టుకున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే సులువుగా కొత్త కార్డ్ పొందే ఛాన్స్!

మన నిత్య జీవితంలో ఆధార్ కార్డ్ కు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధార్ కార్డ్ వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అయితే కొన్నిసార్లు ఆధార్ కార్డ్ ను పోగొట్టుకోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆధార్ కార్డ్ ను పోగొట్టుకుంటే కొత్త కార్డ్ ను ఎలా పొందాలనే అవగాహన కూడా చాలామందికి ఉండదు. అయితే ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది.

ఆధార్ కార్డ్ మిస్ అయితే మొదట యూఐడీఏఐ టోల్ ఫ్రీ నంబర్ లేదా 1947 ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్ కు మొబైల్ నంబర్ లింక్ అయ్యి ఉంటే మాత్రమే కొత్త కార్డును పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. https://myaadhaar.uidai.gov.in వెబ్ సైట్ ద్వారా సులభంగా కొత్త ఆధార్ కార్డ్ ను పొందవచ్చు. లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ అనే ఆప్షన్ ను ఎంచుకుని వివరాలను ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ పొందవచ్చు.

ఆ తర్వాత వన్ టైమ్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ కార్డ్ ను పొందవచ్చు. ఆధార్ కార్డ్ కు మొబైల్ నంబర్ లింక్ కాకపోతే 1947 నంబర్ కు కాల్ చేసి వివరాలను అందించి ఈఐడీ వివరాలను తెలుసుకుని ఆధార్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా కూడా ఆధార్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆధార్ ను ప్రింటవుట్ ను తీసుకుని ఆ ఆధార్ కార్డ్ ను సులభంగా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆధార్ కార్డ్ ఎక్కడా మిస్ యూజ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఈ ఆధార్ కార్డ్ కూడా సాధారణ ఆధార్ కార్డ్ లా పని చేస్తుంది. ఆధార్ కార్డ్ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సులభంగానే కొత్త కార్డ్ ను పొందే అవకాశం ఉంటుంది.