జాక్ డోర్సే.. పరిచయం అక్కర్లేని పేరు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన జాక్ డోర్సే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు ప్రస్తుతం ట్విట్టర్ ఈ స్థాయిలో ఎంతోమంది యూజర్ నన్ను సంపాదించుకుంది అంటే దాని వెనుక జాక్ డోర్స్ కృషి ఎంతగానో ఉంది. 2021 నవంబర్‌లో ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొన్నాళ్ల తర్వాత బోర్డు నుంచి ఆయన వైదొలిగారు.అయితే ఈయన ట్విట్టర్ సీఈఓ గా తప్పుకోవడంతో ట్విట్టర్లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు అయితే ఇలా వచ్చినటువంటి మార్పులపై ఈయన ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ట్విట్టర్ కు పోటీగా మరొక సరికొత్త యాప్ ను తీర్చిదిద్దారు. ఆయన తన కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ బ్లూస్కై బీటా వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఈ సరికొత్త యాప్ అన్ని స్మార్ట్ ఫోన్లలోనూ అందుబాటులో లేదు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్‌లో సెలెక్టెడ్ యూజర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. డేటా.ఏఐ అనే యాప్ ఇంటెలిజెన్స్ కంపెనీ వివరాల ప్రకారం.. ఐఓఎస్ యాప్ స్టోర్‌లో బ్లూస్కై ఈ ఏడాది ఫిబ్రవరి 17నే ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటివరకు ఈ సరికొత్త యాప్ ను కేవలం రెండు వేల మంది మాత్రమే ఇన్స్టాల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి 256 క్యారెక్టర్లతో కూడిన పోస్ట్‌ను క్రియేట్ చేసేలా ఈ యాప్ ఇంటర్ఫేస్ను రూపొందించారని తెలుస్తోంది. ట్విట్టర్ పోస్ట్ బాక్స్‌లో ‘What’s happening’ అని అడుగుతుంది. దీన్ని బ్లూస్కైలో దాన్ని ‘What’s Up?’గా మార్చారట.షేర్, మ్యూట్, బ్లాక్ అకౌంట్స్ లాంటి ఫీచర్లు కూడా బ్లూస్కైలో ఉన్నట్లు డేటా.ఏఐ సంస్థ తెలిపింది. 2019లో ప్రారంభమైనటువంటి బ్లూ స్కై 2022లో ఉనికిలోకి వచ్చిందని ట్విట్టర్‌ను వీడాకే డోర్సే ఫస్ట్‌టైమ్ దీని గురించి మాట్లాడారు. దీన్ని ‘ఓపెన్ డీసెంట్రలైజ్డ్ స్టాండర్డ్ ఫర్ సోషల్ మీడియా’గా ఆయన అభివర్ణించారు. రానున్న రోజుల్లో ఇది మరింత మందికి చేరువకు కానుందని, ట్విట్టర్ కు ఇది గట్టి పోటీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.