Prudhvi Raj: X లోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్… ఇకపై అన్ని ఇక్కడే మాట్లాడుతా అంటూ?

Prudhvi Raj: 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీరాజ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ఈయన గతంలో వైసిపి పార్టీలో ఉన్నారు అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ ఈయనని సస్పెండ్ చేయడంతో ఈయన కూడా జనసేన పార్టీలోకి వెళ్లారు. ఇలా జనసేన పార్టీలో ఉన్నటువంటి పృథ్వీరాజ్ సమయం దొరికిన ప్రతిసారి వేదిక ఏదైనా సరే వైసీపీని టార్గెట్ చేస్తూ వచ్చారు..

ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం లైలా సినిమా వేడుకలో కూడా ఈయన వైసీపీని టార్గెట్ చేస్తూ పరోక్షక కామెంట్లు చేయడంతో ఎంతో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈయన కామెంట్లు కారణంగా సినిమాకు ఇబ్బందులు వచ్చాయి. ఇలా తరచూ వైసిపి గురించి పరోక్షంగా మాట్లాడుతూ సెటైర్లు వేస్తున్నటువంటి ఈయన వ్యవహార శైలిని చాలామంది తప్పు పట్టారు.. రాజకీయాలలో ఉంటున్న పృథ్వీరాజ్ రాజకీయాల గురించి ఏదైనా విమర్శలు చేయాల్సి వస్తే ఏదైనా ఒక సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా చేయాలి తప్ప సినిమా వేదికలపై కాదు అంటూ ఈయన వ్యవహార శైలిని చాలామంది సెలబ్రిటీలు తప్పు పట్టారు.

ఈ క్రమంలోనే ఈయన తన భావాలను వ్యక్తపరచడం కోసం తాజాగా X లోకి అడుగు పెట్టారు ఈ క్రమంలోనే ఎక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసిన ఈయన మొదటి పోస్ట్ కూడా షేర్ చేశారు. కొత్తగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. హాయ్ నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. నేను అధికారికంగా ట్విట్టర్లోకి వచ్చాను. నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుండి ఈ X అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చని తెలియపరుస్తాను అని తెలిపారు.

ఇకపై సినిమా వేదికలపై ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడరని ఈ సందర్భంగా చెప్పకనే చెప్పేశారు. ఇకపోతే ఎక్స్ లోకి అడుగుపెట్టిన పృథ్వి ఇకపై వైసీపీని టార్గెట్ చేస్తూ ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారో తెలియాల్సి ఉంది. మరి ఈయన వ్యాఖ్యలకు వైసిపి ఏ విధంగా కౌంటర్ ఇస్తుందనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.