కరోనా మహమ్మారి కల్లోలంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ కూడా మొదలు కాగా, దాని బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్స్, స్పోర్స్ మ్యాచ్‌లు కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయి. అయినప్పటికీ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సిరీస్ జరుగుతుంది. మొన్నటి వరకు టీ 20 సిరీస్ జరగగా దానిని క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లండ్ జట్టు.
ఇప్పుడు వన్డే సిరీస్ మొదలైంది. ఈ మ్యాచ్‌లని కూడా బయోబబుల్ వాతావరణంలో జరుపుతున్నారు. అయినప్పటికీ సౌతాఫ్రికాకు చెందిన ఓ ఆటగాడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో తర్వాతి రోజుకు తొలి వన్డేని వాయిదా వేశారు. కాని పరిస్థితులని గమనించి ఆ మ్యాచ్‌ని పూర్తిగా రద్దు చేశారు. ఇక రెండు, మూడు వన్డేలు అయిన జరుగుతాయని అందరు భావిస్తున్న క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా సిరీస్‌నే రద్ధు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇరు జట్ల ప్లేయర్స్ మానిసిక, శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు రెండు బోర్డులు ప్రకటన విడుదల చేశాయి.
అయితే భవిష్యత్‌లో వీలున్నప్పుడు తప్పకు ఇంగ్లండ్-సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌ను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని క్రికెట్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు చెబుతున్నాయి. మొన్నటి వరకు సౌతిఫ్రాకి క్రికెటర్‌కు కరోనా అని భయపడగా, ఇప్పుడు రెండో వన్డేకు ముందు ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్‌కు కూడా పాజిటివ్ అని తేలడంతో ఆ మ్యాచ్‌నూ వాయిదా వేశారు. సిరీస్ కూడా రద్ధు చేస్తేనే మంచిదని ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల వరకు బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు జరగగా, ఇప్పుడిప్పుడే 50 శాతం ప్రేక్షకులని గ్రౌండ్‌లోకి అనుమతిస్తున్నారు. వారు సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్క్‌లు లేకుండా కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది.