లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఉత్కంఠ భరితమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బ్యాటుతో అద్భుతంగా ఆరంభించిన టీమిండియా.. చివర్లో విరామం లేకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ శుభమన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌లు సెంచరీలు సాధించడంతో భారీ స్కోర్ చేసింది. అయితే మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 471 పరుగులకే పరిమితం అయ్యింది.
దీనికి ప్రతిగా ఇంగ్లాండ్ జట్టూ అదే దూకుడుతో బాటింగ్‌కు దిగింది. ముఖ్యంగా ఓలీ పోప్ 106 పరుగులతో సెంచరీ కొట్టి మెరిశాడు. హ్యారీ బ్రూక్ మాత్రం కేవలం ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. అతను 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. జెన్నిస్ మిత్, క్రిస్ వోక్స్, బెన్ డకెట్ కూడా భారత్ బౌలింగ్‌కు గట్టిపోటీనిచ్చారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌కు కేవలం 6 పరుగుల స్వల్ప లీడ్ లభించింది.
భారత్ బౌలింగ్ విషయానికి వస్తే.. జస్ప్రీత్ బూమ్రా ఐదు వికెట్లు తీసి మరోసారి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీశారు. ఇప్పుడు మ్యాచ్ మూడో దశలోకి ప్రవేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో నెమ్మదిగా స్కోరు పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గెలవాలంటే లేదా డ్రా చేయాలన్నా భారత్ బ్యాటింగ్ మళ్లీ నిలదొక్కుకోవాలి. రెండో ఇన్నింగ్స్ కీలకమవ్వనుంది. మిగిలిన రెండు రోజులలో మ్యాచ్ ఫలితం ఎటుపోతుందో చూడాలి.