Home News పోలీస్ స్టేష‌న్‌లో విరాట్ కోహ్లీ ఆడీ కారు... ఎవ‌రికి ఉప‌యోగం లేకుండా పోయిందంటున్న నెటిజ‌న్స్

పోలీస్ స్టేష‌న్‌లో విరాట్ కోహ్లీ ఆడీ కారు… ఎవ‌రికి ఉప‌యోగం లేకుండా పోయిందంటున్న నెటిజ‌న్స్

అండ‌ర్ 19 టీంకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ ఇప్పుడు భార‌త క్రికెట్ జ‌ట్టు సార‌ధిగా తన బాధ్య‌త‌ల‌ని స‌క్ర‌మంగా నిర్వ‌ర్తిస్తున్నారు. టెస్ట్‌, వ‌న్డే, టీ 20ల‌కు కూడా కోహ్లీనే కెప్టెన్ కాగా, అత‌ని ప్ర‌తిభ‌కు అభిమ‌నులు మంత్ర ముగ్దుల‌వుతున్నారు. క్రీడాకారుడిగాను కోహ్లీ రికార్డుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పాత రికార్డుల‌ని తిర‌గరాస్తున్న కోహ్లీ ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా టూర్‌తో బిజీగా ఉన్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ స్టార్ క్రికెట‌ర్ తండ్రి కానున్నాడు.

Kohli Car | Telugu Rajyam

కోహ్లీకి ల‌గ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో ల‌గ్జరీ కార్స్ వాడాడు. అంతేకాదు కొన్ని కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా కూడా ఉన్నాడు. కొంత కాలం నుండి ఆడి ఇండియాకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్న కోహ్లీకి ఈ కంపెనీ ‘ఆడి ఆర్‌8 వీ10 కానుకగా ఇచ్చింది. దీనిని మ‌నోడు ఓ బ్రోక‌ర్ ద్వారా సాగ‌ర్ థ‌క్క‌ర్ అనే వ్య‌క్తికి అమ్మేశాడు. త‌న గార్ల్ ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాల‌ని కోహ్లీ ద‌గ్గ‌ర కొనుగోలు చేశాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కాని ఆ కారు ఇప్పుడు పోలీస్ స్టేష‌న్‌లో ఎండ‌కు ఎండి, వాన‌కు త‌డిచి షేపులు లేకుండా మారింది

సాగ‌ర్ థ‌క్క‌ర్ అనే వ్య‌క్తికి చాలా నేర చ‌రిత్ర ఉంద‌ట‌. స్కామ్‌ల‌లో దాదాపు 12 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు మోసం చేసి ప‌ట్టుబ‌డ్డాడు. ముంబై పోలీసులు అత‌నిని అరెస్ట్ చేయ‌డంతో పాటు అత‌ని ఆస్తుల‌న్నింటిని సీజ్ చేశారు. ఇందులో భాగంగా ఈ ఆడీ కారు కూడా సీజ్ చేయ‌బ‌డింది. తాజాగా ఆటోమొబైల్‌ రంగం నిపుణుడొకరు కోహ్లీ వాడిన ఆడి ఆర్‌8 వీ10 కారు’ ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. ఏడాది కాలంగా ఈ కారు ఇక్క‌డే దుమ్ము ప‌ట్టి పాడు అవుతుండగా, కోహ్లీ వాడిన తొలి ఆడి కారుకి ఇలాంటి దుస్తితి రావ‌డం అభిమానుల‌ని ఎంత‌గానో క‌ల‌వ‌రప‌రుస్తుంది. మ‌రి ఈ వార్త‌పై కోహ్లీ ఎమైన స్పందిస్తాడా అనేది చూడాలి.

Related Posts

హుజూరాబాద్ బై పోల్: ఈటెల సంగతేంటో తేలిపోనుంది.!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భవిష్యత్తుకి హుజూరాబాద్ ఉప ఎన్నికతో శుభం కార్డు పడుతుందా.? అధికా తెలంగాణ రాష్ట్ర సమితి మీద బీజేపీ పైచేయి సాధిస్తుందా.? దళిత బంధు పథకం సంగతేంటి.? హుజూరాబాద్...

బద్వేలు ఉప ఎన్నిక: వైసీపీకి పోటీ ఇచ్చేంత సీన్ వుందా.?

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ేడాది మార్చిలో సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య (వైసీపీ)...

వర్మగారి రక్త చరిత్ర ఇప్పుడు ఏ ‘సిరా’తో రాస్తాడో

రాయలసీమ రక్త చరిత్ర అయిపోయింది. బెజవాడ రక్త చరిత్ర అయిపోయింది. ఇక ఇప్పుడు తెలంగాణా రక్త చరిత్రపై మన ఘన సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి మళ్లింది. 90ల కాలంలో...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News