సిడ్ని వన్డేలో భారత్ ఓటమి

సిడ్ని వన్డేలో భారత్ ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో 288 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఇండియా 50 ఓవర్లలో 254 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయింది. 34 పరుగుల తేడాతో భారత్ ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.  భారత్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ 133 పరుగులు చేశాడు. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ పేలవ ప్రదర్శన చేయడంతో భారత్ ఓటమి పాలైంది. ధోని 51, భువనేశ్వర్ 29 పరుగుల  చేశారు.  

బెహ్న్రెడార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగిన ధోనీ.. రోహిత్‌తో కలిసి 137 పరుగులు జోడించాడు. జ‌ట్టును పటిష్ఠ స్థితిలో నిలిపిన తర్వాత రోహిత్ దూకుడు పెంచాడు. 62 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసిన రోహిత్.. 110 బంతులో సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో అత‌నికిది 22వ సెంచరీ. శ‌త‌కం త‌ర్వాత‌ సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు. స్టాయినీస్ వేసిన 44వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది 12 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్ మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టేందుకు ప్రయత్నించిన జడేజా డీప్‌బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో షాన్ మార్ష్ చేతికి చిక్కాడు. స్టాయినీస్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రోహిత్ వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖాయమైంది. ఆసీస్ బౌలింగ్‌ను అంచనావేయడంలో ఇబ్బందిపడ్డ రాయుడు, దినేశ్ కార్తీక్(12) నిరాశపరిచారు. 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 288 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(59), షాన్ మార్ష్(54), హాండ్స్‌కాంబ్(73) అర్ధశతకాలతో రాణించడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో ఆల్‌రౌండర్ స్టాయినీస్(47 నాటౌట్) విజృంభించడంతో అలవోకగా 250 పరుగుల మార్క్ దాటింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/66), కుల్దీప్ యాదవ్(2/54), జడేజా ఒక వికెట్ తీశారు. మూడు వన్డేల సిరిస్ ఆసీస్ 1-0 ఆధిక్యంతో ఉంది.