దుబాయ్ :IPL -2020లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ గెలుపొందింది. అత్యంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు ఢిల్లీని విజయం వరించింది. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లో వారి బౌలింగ్ అద్భుతంగా సాగింది. మొదటి నుంచి మ్యాచ్ మీద పట్టు సాధించిన రాజస్థాన్ రాయల్స్, చివరి దశలో పట్టు కోల్పోయింది. 12 ఓవర్లో సంజూ శాంసన్ ఔట్ అయిన తర్వాత మ్యాచ్ మలుపు తిరిగింది. రాబిన్ ఊతప్ప కూడా 14వ ఓవర్లో రనౌట్ అయిన తర్వాత మ్యాచ్ ఓ రకంగా చేజారిపోయింది. బిగ్ హిట్టర్ రాహుల్ తెవాటియా మ్యాచ్‌ను గెలిపిస్తాడని భావించినా రాజస్థాన్ ఆశలు నెరవేరలేదు. ఢిల్లీ బౌలర్లు రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లారు. 162 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 148 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఢిల్లీ జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాజస్థాన్ ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆరంభంలో ఢిల్లీ తడబడింది. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొదటి ఓవర్ తొలి బంతికే దిల్లీ ఓపెనర్ పృథ్వీషా(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆర్చర్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి రహానె(2) కూడా ఔటయ్యాడు. తర్వాత శ్రేయస్ అయ్యార్‌తో కలిసి దావన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దాటిగా ఆడి హాఫ్ సెంచరీని పూర్తిచేశాడు. చివరకు 11.4 ఓవర్లలో ధావన్(57),శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి కార్తిక్ త్యాగీ చేతికి చిక్కాడు. ఇక ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ (53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా హఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరకు ఢిల్లీ నిర్ణత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 161 పరగులు చేసింది.
A brilliant win here for the @DelhiCapitals as they beat #RR by 13 runs in Match 30 of #Dream11IPL.#DCvRR pic.twitter.com/jgF35MrnZR
— IndianPremierLeague (@IPL) October 14, 2020
162 పరుగుల ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు మంచి ఓపెనింగ్ లభించింది. స్టోక్స్ (41), బట్లర్ (22) రన్స్ చేశారు. కానీ, ఆ వెంటనే స్మిత్ (1) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ (25), ఊతప్ప (32) ఇద్దరూ కలసి మళ్లీ గాడిన పెట్టారు. కానీ, సంజూ శాంసన్‌ను పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండు ఓవర్లకే ఊతప్ప కూడా ఔట్ అయ్యాడు. రాహుల్ తెవాటియా (14) మ్యాచ్‌ను మలుపుతిప్పొచ్చని భావించినా, ఢిల్లీ బౌలర్స్ ఆ చాన్స్ ఇవ్వలేదు. చివరి ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చివరి ఓవర్లలో ఏ రేంజ్‌లో బౌలింగ్ చేశారో, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ కూడా అంతకు మించిన జోష్‌తో బౌలింగ్ చేశారు.
ఈ మ్యాచ్‌లో సంథింగ్ స్పెషల్ ఏంటంటే, మ్యాచ్ ఫస్ట్ బాల్‌కు వికెట్ పడింది. మ్యాచ్ లాస్ట్ బాల్‌కు కూడా వికెట్ పడింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ పృథ్వీ షా డకౌట్ అయ్యాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో లాస్ట్ బాల్‌కు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ శ్రేయాల్ గోపాల్ (6) ఔట్ అయ్యాడు.