ఆస్ట్రేలియా-భారత్ తొలి టెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది . డే అండ్ టెస్టు కావడం, పింక్ బాల్‌తో ఆట జరుగనుండటంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అడిలైడ్ ఓవల్‌లో డిసెంబర్ 17న మొదలు కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ బుధవారం జట్టు సభ్యులను ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా, పృథ్వీ షా చోటు దక్కించుకోగా.. వార్మప్ మ్యాచ్‌ల్లో రాణించిన రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ అనూహ్యంగా బెంచ్‌కే పరిమితమయ్యారు.
శుభ్‌మన్ గిల్ రెండో వార్మప్ మ్యాచ్‌లో 43, 65 పరుగులతో ఫరవాలేదనిపించాడు. కానీ అతని స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేయడంపై కొందరు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వార్మప్ మ్యాచుల్లోని నాలుగు ఇన్నింగ్స్‌లలో షా 0, 19, 40, 3 పరుగులు మాత్రమే చేశాడు. ఇక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం కల్పించారు. ఆల్‌రౌండర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చోటు దక్కించుకోగా.. బ్యాట్స్‌మన్ హనుమ విహారి మిడిల్ ఓవర్లలో బౌలర్‌గానూ సేవలు అందించనున్నాడు. ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్ టీమిండియా బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది.
UPDATE🚨: Here’s #TeamIndia’s playing XI for the first Border-Gavaskar Test against Australia starting tomorrow in Adelaide. #AUSvIND pic.twitter.com/WbVRWrhqwi
— BCCI (@BCCI) December 16, 2020
తొలి టెస్టులో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, ఫృథ్వీ షాలకు టీమిండియా మేనేజ్ మెంట్ చోటు ఇచ్చింది. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించని ఫృథ్వీ షాను తీసుకొని రాణించిన శుభమన్ గిల్ లను పక్కనపెట్టడం విశేషంగా మారింది. ఫృథ్వీ దూకుడు అసీస్ పిచ్ లపై లాభిస్తుందని అనుకుంటున్నారు. ఇక మూడోస్థానంలో పూజారా ఆ తర్వాత వైస్ కెప్టెన్ రహానె, కెప్టెన్ కోహ్లీలు రానున్నారు. ఇక ప్రాక్టీస్ మ్యాచ్ లో దంచికొట్టిన రిషబ్ పంత్ ను పక్కన పెట్టి సీనియర్ వృద్ధిమాన్ సాహాను కీపర్ గా టీమిండియా మేనేజ్ మెంట్ ఎంపిక చేసింది. మిడిల్ ఆర్డర్ లో తెలుగు క్రీడాకారుడు హనుమవిహారి సీటు ఖాయం చేసుకున్నారు.స్పిన్నర్ కోటాలో రవీంద్ర జడేజాకు బదులుగా అశ్విన్ కు అవకాశం ఇచ్చారు. విహారి పార్ట్ టైం స్పిన్నర్ గా చేయనున్నాడు.