భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టి20 సిరిస్ కు మరియు వన్డే మ్యాచ్ లకు ఇండియన్ టీమ్ ను బిసిసిఐ ప్రకటించింది. న్యూజిలాండ్ తో జరిగిన టి20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ మళ్లీ టీమ్ లోకి వచ్చాడు. ఈ సారి రోహిత్ శర్మకు విశ్రాంతి ఇస్తారని భావించినా ఈ సారి అతనికి కూడా టింలో చోటు దక్కింది.
తొలిసారిగా యువ స్పిన్నర్ మయాంక్ మార్కండెకు నేషనల్ టీంలో అవకాశాన్నిచ్చారు. ఐపీఎల్ లో ముంబై తరపున ఆడిన మార్కండె గత ఏడాది అద్భుతంగా రాణించాడు. ఇంగ్లాండ్ లయన్స్ తో ఇండియా ఏ తరపున ఆడుతున్న మార్కండె అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు టి20 మ్యాచ్ లకు మరియు తర్వాత తొలి రెండు వన్డేలకు వేరు వేరుగా టింలను ప్రకటించారు. టి 20 లో పేస్ బౌలర్ సిద్దార్ధ్ కౌల్ కు అవకాశం ఇచ్చారు. తర్వాత వన్డే మ్యాచ్ లలో అతనికి అవకాశం ఇవ్వలేదు. అతని స్థానంలో భువనేశ్వర్ కు అవకాశమిచ్చారు.
ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ( వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, విజయ్ శంకర్, యజ్వేంద్ర చహల్, బూమ్రా, ఉమేశ్ యాదవ్, సిద్దార్థ్ కౌల్, మయాంక్ మార్కండే.
ఆసీస్‌తో తొలి రెండు వన్డేలకు భారత జట్టు:
విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, బూమ్రా, మహ్మద్ షమీ, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషభ్ పంత్, సిద్ధార్ద్ కౌల్, కేఎల్ రాహుల్.