దీపావళి పండుగకు మాత్రమే దర్శనమిచ్చే హసనాంబ అమ్మవారు.. ప్రత్యేకతలు ఏమిటో తెలుసా..?

దేశవ్యాప్తంగా ప్రజలందరూ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. దీపావళి రోజున ఇంట్లో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో నిష్టగా పూజించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి కొలువై ఉంటుందని ప్రజల నమ్మకం. ఇలా ఇంట్లో అమ్మవారిని పూజించిన తర్వాత ప్రజలందరూ దేవాలయాలకు వెళ్తూ ఆ దేవుళ్లను దర్శించుకుంటూ ఉంటారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలు కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తెలుస్తారు. కర్ణాటకలో ఉన్న హాసన్ పట్టణంలోని హసనాంబ అమ్మవారు కూడా కేవలం దీపావళి రోజులలో మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది.

దీపావళి పండుగకు పది రోజుల ముందు నుండి ఈ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అక్టోబర్ చివర -నవంబర్ మొదట్లో వచ్చే పౌర్ణమి వరకు మాత్రమే అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అందువల్లే ఈ ఆలయానికి హసనాంబ ఆలయం అని పేరు వచ్చింది. ఇక ఈ ఆలయంలోని అమ్మవారు తన భక్తులను ఇబ్బంది పెట్టే వారి పట్ల ఉగ్రరూపం దాల్చి వారి అంతు చూస్తారని పూర్వకాలంలో నుండి వినిపిస్తున్న వార్తలు.

అందుకు ఉదాహరణగా హసనాంబ అత్తగారు ఆమె భక్తులను తరచూ ఇబ్బంది పెడుతూ ఉండటం వల్ల రాయిలా మారమని అత్తగారిని శపించినట్లు పూర్వీకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ రాయి హసనాంబ అమ్మవారి గర్భగుడిలోనే ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. అయితే ప్రతి ఏటా గుడి తలుపులు తెరిచేసరికి ఆ రాయి అమ్మవారి విగ్రహం వైపు ఒక ఇంచు ముందుకి కదులుతున్నట్లు అక్కడ భక్తులు వెల్లడిస్తున్నారు. ఇలా ఒక రాయి ఆ విగ్రహం వద్దకు కదలటానికి వెనుక ఉన్న రహస్యాన్ని శాస్త్రవేత్తలు కూడా తేల్చలేకపోతున్నారు.