దీపావళి వెలుగుల పండుగ అని అందరికీ తెలిసిందే. ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తూ, కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేస్తూ పండుగ ఉత్సాహం
నెలకొంటుంది. కానీ చాలా మంది దీపావళి ముందు ఇళ్లకు, ఆఫీసులకు కొత్త పెయింట్ వేయడం ఒక శుభ సూచకంగా భావిస్తారు. ఈ సమయంలో కొత్త రంగులతో అలంకరించడం వాస్తవానికి మంచిదే, కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రంగులు లక్ష్మీదేవిని దూరం చేసేస్తాయని పండితులు చెబుతున్నారు. ఇవి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెడతాయని హెచ్చరిస్తున్నారు.ఈ కథనంలో అవేంటో తెలుసుకుందాం.
ఇంట్లో వేసే రంగులు కేవలం అందం కోసం కాకుండా.. శుభం, ఆర్థిక ప్రగతిని ఆకర్షించే చిహ్నాలుగా కూడా భావిస్తారు. వాస్తు ప్రకారం రంగులు గ్రహాలతో ముడిపడి ఉంటాయి. ప్రతి రంగు ఒక గ్రహ శక్తిని ప్రతిబింబిస్తుంది. అందుకే తప్పుడు రంగులు వాడితే ఆ శక్తి ప్రతికూలంగా మారి జీవితంలో ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, అశాంతి తెస్తాయని అంటున్నారు.
వాస్తు నిపుణుల ప్రకారం నలుపు రంగు దీపావళి సమయంలో అతి పెద్ద అశుభ సూచకం. నలుపు రంగు శని మరియు రాహు గ్రహాలకు సంకేతం. ఈ రంగు చీకటిని, నిరాశను సూచిస్తుంది. ఇంటి లేదా ఆఫీసు గోడలకు, ఫర్నీచర్‌కు లేదా డెకరేషన్‌కు నలుపు రంగును ఉపయోగిస్తే, సంపద ప్రవాహం ఆగిపోతుందని చెబుతారు. ఈ రంగు వాడకం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించకపోగా, ఆర్థిక నష్టాలు, రుణాలు, దివాలా పరిస్థితులు ఎదురవుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొందరు ఆఫీసు డెస్క్‌లకు నలుపు పెయింట్ వేస్తారు అది కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
అలాగే గాఢ ఎరుపు, బూడిద, గోధుమ, డార్క్ బ్లూ వంటి గాఢ రంగులు కూడా ఈ కాలంలో వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రంగులు ఇంట్లో ఆగ్రహాన్ని, అశాంతిని, ఒత్తిడిని పెంచుతాయి. ముఖ్యంగా దీపావళి రోజుల్లో ఇవి వాడితే శుభ శక్తులు ఇంట్లో నిలవవు, బదులుగా ప్రతికూల శక్తులు వాసం చేస్తాయని వాస్తు చెబుతుంది.
ఇక దీపావళి సమయంలో ఇంటికి శుభం చేకూర్చే రంగుల విషయానికి వస్తే తెలుపు, లైట్ పింక్, లైట్ బ్లూ, ఆరెంజ్, క్రీమ్, లైట్ యెల్లో వంటి రంగులు ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఆకర్షిస్తాయి. వాస్తు ప్రకారం, తెలుపు రంగు చంద్రునికి సంకేతం అది ప్రశాంతతను, ఆరెంజ్ రంగు సూర్యుని శక్తిని సూచిస్తుంది. లైట్ పింక్ ప్రేమ, సాన్నిహిత్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రంగులను రూమ్‌ల స్వభావం ప్రకారం ఎంచుకుంటే ఫలితం మరింత శుభప్రదంగా ఉంటుంది. ఉదాహరణకు పూజా గదికి తెలుపు లేదా ఆరెంజ్, బెడ్‌రూమ్‌కు లైట్ పర్పుల్, కిచెన్‌కు లైట్ రెడ్ లేదా ఎలువు రంగులు అనుకూలం.
వాస్తు నిపుణులు చెబుతున్నట్లు, ఈ పండుగ సమయంలో ఒక చిన్న జాగ్రత్త పెద్ద మార్పు తీసుకురాగలదు. ఇంటి గోడలపై శుభకరమైన రంగులు వేసి, దివాళి రోజున దీపాలు వెలిగిస్తే, లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుందట. కానీ తప్పుడు రంగులు వాడితే ఆ శుభశక్తులు దూరమై, చీకట్లు ఆవరించేస్తాయి.అందుకే ఈ దీపావళి పండుగలో కొత్త పెయింట్ వేయాలనుకుంటే, వాస్తు శాస్త్రం సూచించిన శుభరంగులను మాత్రమే ఎంచుకోండి. చీకట్లకు బదులుగా వెలుగులు, అశుభానికి బదులుగా ఐశ్వర్యం నిండిన జీవితం మీ ఇంటిని అలంకరిస్తుంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
