దీపావళి పండగ తర్వాత పూజలో ఉపయోగించిన ఆ విగ్రహాలను ఏం చేయాలో తెలుసా?

మన హిందూ ధర్మంలో పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశ ప్రజలందరూ ప్రతి పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు . అలాగే అమావాస్య రోజున వచ్చి దీపావళి పండుగను కూడా దేశ ప్రజలందరూ చిన్న పెద్ద కులమత భేదాలు లేకుండా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం రాముడు అరణ్యవాసం ముగించుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున ఆ దేశ ప్రజలందరూ దీపాలు వెలిగించి ఆ అయోధ్య రామున్ని స్వాగతించారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ప్రతి ఏడూ అదే రోజున దీపావళి పండుగను జరుపుకుంటున్నారు.

ఇక ఈ దీపావళి పండుగ రోజున ముఖ్యంగా లక్ష్మీ గణేష్ ని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేసి అందంగా పువ్వులతో రంగురంగుల ముగ్గులతో అలంకరించి ఆ లక్ష్మీదేవిని గణేశుని ఆరాధించడం వల్ల ఏడాది పాటు లక్ష్మీదేవి ఇంట్లో కొలవై ఉండటమే కాకుండా ఆ వినాయకుడి ఆశీస్సులతో విజ్ఞాలన్ని తొలగిపోతాయని నమ్మకం. అయితే ప్రతి ఏడూ దీపావళి పండుగ రోజున కొత్త విగ్రహాలను తెచ్చి ప్రతిష్టించిన తర్వాత పూజలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో పాత విగ్రహాలను ఏం చేయాలన్నది చాలామందికి సందేహం ఉంటుంది

మత గ్రంధాల ప్రకారం దీపావళి పండుగ రోజున కొత్త లక్ష్మీదేవి, గణేశుడు విగ్రహాలను తెచ్చి ఇంట్లో ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తారు. లక్ష్మీ గణేశుడు సంవత్సరం పాటు ఉత్తరాదిన కొలవై ఉండలేడు కాబట్టి.. దీపావళి రోజున పాత విగ్రహాలను నిమజ్జనం చేసిన తర్వాతే కొత్త విగ్రహాలను ప్రతిష్టించాలి. ఇలా చేయటం వల్ల ఏడాది పాటు సిరిసంపదలు ఉండటమే కాకుండా జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం. అయితే పాత విగ్రహాలను నిమజ్జనం చేయటానికి శుద్ధమైన నీరు ప్రవహిస్తున్న నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయాలి.