పాపం.. నటి సుధ నిజ జీవితంలో మర్చిపోలేని కన్నీటి కష్టాలు!

సుధ ప్రముఖ సినీనటి. దాదాపు 500కు పైగా సినిమాలలో నటించింది. ఈమె తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించింది. అల్లు రామలింగయ్య సలహా మేరకు తెలుగు బాగా నేర్చుకొని తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. సుధ మొదట్లో నాటకాలలో నటించే సమయంలో ఎస్వీ ముత్తురామన్, బాలచందర్ లు న్యాయ నిర్ణీతలుగా ఒక నాటకాన్ని వ్యవహరించినప్పుడు అందులో సుధ ను చూసి సినిమా అవకాశం ఇచ్చారు.

తమిళంలో మూడు చిత్రాలకు హీరోయిన్ గా నటించి సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాల వల్ల పెద్దగా పేరు రాకుండా కాస్త గ్యాప్ వస్తే బాలచందర్ గారు హీరోయిన్ చెల్లెలి పాత్ర ఉంది,ఒక వారంలోపు మీ నిర్ణయం చెప్పండి అంటే ఒక గంటలోనే నటిస్తానని చెప్పేసింది. ఆ తర్వాత ఆమె సహాయక పాత్రలో అవకాశాలు వచ్చాయి. ఆమె తెలుగులో తల్లిదండ్రులు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది.

ఆమె గ్యాంగ్ లీడర్, చాలా బాగుంది, అతడు, దూకుడు, బాద్ షా లాంటి చిత్రాలలో మంచి పాత్రలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, తమిళంలో సూర్య, అజిత్, విశాల్ వంటి హీరోలందరికి తల్లి పాత్రలు చేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ తన నిజ జీవితంలోని విషయాలను చెబుతూ తన భర్త, కొడుకు తనకు దూరంగా అమెరికాలో ఉన్నారని ఎప్పుడో ఒకప్పుడు నా విలువ తెలుస్తుంది అని పేర్కొంది. వారి మధ్య మాటలు కూడా లేవని చెప్పింది.

ఆమె చెన్నైలో నివాసం ఉండి కూతురికి వివాహం చేశానని తన తండ్రి ఉండే వరకు తనకు ఏ బాధ ఉండేది కాదని, తండ్రి చనిపోయాక ఇతరులను నమ్మకుండా తనను తాను నమ్ముకుని జీవిస్తున్నట్లు చెప్పుకుంది. ఇక సినిమాల విషయాలకు వస్తే తన పాత్రకు గుర్తింపు ఉంటుంది అని భావిస్తేనే నటిస్తానని గుర్తింపు లేని పాత్రలలో నటించనని పేర్కొంది. గుర్తింపు ఉన్న పాత్రలు, సింపతి ఉన్న పాత్రలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంది. ప్రస్తుతం రెండు, మూడు సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం.