సినీ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్యకృష్ణ!

రమ్యకృష్ణ భారతీయ సినీ నటి. చలనచిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఈమె భర్త. ఈమెకు ఇద్దరు కుమారులు సంతానం.ఈమె 1967 లో చెన్నైలో జన్మించింది. 1985లో విడుదలైన భలే మిత్రులు చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత 1989లో వచ్చిన సూత్రధారులు సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందినప్పటికీ చాలాకాలం వరకు సరైన అవకాశాలు రాలేదు.

ఒకానొక దశలో రమ్యకృష్ణ నటిస్తే ఆ సినిమా పరాజయం అవుతుందన్న నమ్మకం చిత్రసీమలో ఉండేది. 1992లో విడుదలైన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది. అప్పటినుండి కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వరుస సినిమాలలో నటిస్తూ, దాదాపు అవన్నీ విజయం సాధించడంతో రమ్యకృష్ణ నటించిన ప్రతి చిత్రం విజయం అవుతుంది అనే నమ్మకం నిర్మాతలలో కలిగింది.

1990 నుండి ఒక దశాబ్దం పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో నటించి అగ్ర హీరోయిన్ గా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇలా తనదైన నటులతో విమర్శకుల నుండి ప్రశంసలు పొందింది. నరసింహ సినిమాలో రజినీకాంత్ తో పోటీపడి మరి నీలాంబరి పాత్రకు న్యాయం చేసింది. ఈ సినిమా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తీసుకువచ్చింది.

తన కుమారుడు రిత్విక్ పేరుతో ఒక నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. పలు టీవీ షోలలో కూడా చేయాలని ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇక బాహుబలిలో ఈమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే సర్దుకుపోక తప్పదు. ఎప్పుడు సర్దుకుపోవాలి అనేది వారి వ్యక్తిగత విషయం.

ప్రతి ఫీల్డ్ లోనూ సర్దుకు పోతేనే రాణించగలుగుతాం అనే వార్త అగ్ర హీరోయిన్ నోటి నుండి రావడం, ప్రస్తుతం ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న కొత్తవారికి ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా అనేది రంగుల ప్రపంచం. చూసేవారికి బాగానే ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో ఉన్నవారిలో కొంతమంది పరిస్థితి భిన్నంగా ఉంటుంది అనే కామెంట్స్ వైరల్ గా మారాయి.