Rana Daggubati: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు డైరెక్టర్. అంతేకాకుండా ఈ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమాల్లో ట్రెండ్ మొదలైంది అని చెప్పాలి. జక్కన్న డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి రెండు భాగాలు ప్రపంచస్థాయిలో విడుదల అయ్యి సత్తాను చాటాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్ గెలుపుతో మరోసారి వరల్డ్ వైడ్‌గా తెలుగు సినిమా పేరు వినిపించేలా చేసింది.
ఇంత ఘనత తీసుకొచ్చిన రాజమౌళి మరోసారి బాహుబలిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో మరోసారి రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా విడుదల అయ్యి పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల రాబోతుందని రాజమౌళి ప్రకటించారు. కాగా బాహుబలి చిత్రంలో ప్రభాస్ తో పాటు రానా కీలక పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రభాస్ బాహుబలి పాత్రలో నటించగా రానా బల్లాలదేవ పాత్రలో నటించి మెప్పించారు.
https://twitter.com/RanaDaggubati/status/1945465735335055501?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1945465735335055501%7Ctwgr%5E68ac7d631860634a372084ad41560a76ca1aef02%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftollywood-hero-rana-daggubati-reply-netizen-funny-question-2507350
అయితే ఒకప్పుడు అనగా బాహుబలి 2 సినిమా విడుదల కాకముందు అందరినీ ఆలోచింపజేసిన ప్రశ్న కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు. తాజాగా ఇలాంటి ప్రశ్న ఒకటి నేటిజెన్ వేసాడు ఒకవేళ బాహుబలిని కట్టప్ప చంపకపోతే ఏం జరిగి ఉండేదని ట్విటర్ వేదికగా ప్రశ్నించాడు. ఇది చూసిన హీరో రానా స్పందించాడు. కట్టప్ప ఆ పని చేయకపోతే.. నేను బాహుబలిని చంపేసేవాడినని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన ఫ్యాన్స్ భళ్లాల దేవ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
