కాస్టింగ్ కౌచ్ గురించి నవ్వుతూ చెప్పిన భానుశ్రీ..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో షోలు, ఇంకా ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూ అలరిస్తున్న తెలుగు యంగ్ యాంకర్ “భాను శ్రీ” తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు మొదటగా పలు ధారావాహికలలో నటించే అవకాశాలు దక్కించుకొని బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ యాంకరింగ్ పై మనసు మళ్లడంతో ప్రస్తుతం బాగానే రాణిస్తోంది.

భాను శ్రీ హీరోయిన్ అవ్వాలనే కోరికతో ఆమె తన తల్లిదండ్రులతో ఫైట్ చేసి మరీ ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన తెలుగమ్మాయి భానుశ్రీ. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర హీరోయిన్‌గా సెటిలయ్యింది. ‘బాహుబలి’ లాంటి భారీ చిత్రంలో హీరోయిన్ పక్కన ఒక చిన్న పాత్రలో నటించడం కూడా జరిగింది. దీనితో ఆమెకు ‘బిగ్ బాస్’ షోలో కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది. దీనితో భానుశ్రీ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

అయితే గతంలో ఆమె ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలో యాంకర్ భాను శ్రీ పాల్గొంది. ఇందులో భాగంగా సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్నటువంటి లైంగిక వేధింపుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశం ఆ మధ్య బాగా వివాదాస్పదమైంది. దీనిపై భానుశ్రీ స్పందించింది.
అయితే భాను ఇందులో ఇతరుల విషయం పక్కన పెడితే ఆమె మాత్రం ఇప్పటివరకు ఎలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కోలేదని స్పష్టంగా తెలియజేశారు. అంతేగాక ఆమె ఏదైనా చిత్రంలో గాని ఇంకా షోలో గాని నటించే ముందే అన్ని విషయాలపై క్లారిటీ గా ఉంటానని అందువల్లనే ఇప్పటి వరకు తాను ఎలాంటి క్యాస్టింగ్ సమస్యలను ఫేస్ చేయలేదని వివరణను కూడా ఇవ్వడం జరిగింది.

అయితే, క్యాస్టింగ్ కౌచ్ అనేది బలవంతంగా ఏమీ జరగదని.. వీళ్లు సహకరిస్తేనే వాళ్లు ఏమయినా చేయగలరని, లేకపోతే వాళ్లేమీ చేయలేరని భానుశ్రీ అభిప్రాయపడ్డారు. రెండు చేతులు కలిపితేనే చప్పట్లని.. అలాగే, ఇద్దరు మనుషుల మధ్య అంగీకారం ఉంటేనే అలాంటివి జరుగుతాయని భానుశ్రీ అన్నారు. అవకాశాల కోసం ముందుకెళ్తున్నప్పుడు మనకు రెండు దారులు ఉంటాయని, వాటిలో మంచి దారిని ఎంచుకునే బాధ్యత మనపైనే ఉంటుందన్నారు.

అంతేకాక ఒకానొక సమయంలో తను కూడా సినిమా అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తన భావనలను వ్యక్తపరచడం జరిగింది. అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి ప్రస్తుతం వరుస అవకాశాలతో బాగానే రాణిస్తున్నానని చెప్పుకొచ్చింది.