మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో నటి నటీమణులు ఉన్నారు. మరి వారిలో కొంతమంది పేర్లు చెప్పగానే వాళ్లంటే నాకు ఇష్టం వీళ్లంటే నాకు ఇష్టం అంటూ కొంతమంది పేర్లు చెబుతుంటారు. అలాగే ఒక టెలివిజన్ షోను నడిపిస్తూ ఉన్న అన్ని టాలెంట్లు కలిగి ఉన్న ఈ యాంకర్ల పేరు చెప్పండి అంటే తప్పు ఆమె ఒక పేరు మాత్రం అందరి నోట పలకడం ఖాయం. ఆమె పేరు మరి ఏదో కాదు అందానికి, చలాకీ తనానికి, తను డాన్స్ చేస్తే చూడటటానికి మంచిగా కనిపిస్తుంది. ఆమెనే మన ఉదయభాను.
అందరిలో కలిసిపోయే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఈమె స్వభావం. తన మాట తీరుతో అందరిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఉన్న యాంకర్లతో పోల్చితే ఎత్తుగా, పొడవుగా అని సమపాలం ఉండే ఉదయభాను అంటే అందరికీ ఇష్టం.
ఉదయభాను ప్రముఖ టీవీ యాంకర్ ఇంకా నటి కూడా. ఇక తన వ్యక్తిగత జీవితం చూసుకున్నట్లయితే ఉదయభాను కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదవ తరగతి చదువుతూ ఉండగానే మొట్టమొదటి సారిగా కెమెరా ముందుకు వచ్చిందని తెలియపరచింది. ఈటీవీలో ప్రసారం అయ్యే హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకుల మధ్య వెళ్లి వాళ్లతో సరదాగా మాట్లాడించడమే ఆ షో ప్రధాన ఉద్దేశం.
ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగల మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణను పొందడం జరిగింది. ఇక ఆమె బాల్యం ఆమె తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. తల్లితండ్రులు డాక్టర్లు ఇంకా ఆమెకు సాఫ్ట్వేర్ జాబ్ చేసే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.
ఉదయభాను నాలుగేళ్ల వయసులోనే తన తండ్రి చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత తన తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. ఉదయభాను ఎంఎ వరకు చదివింది. ఉదయభాను తన తండ్రి చనిపోయిన తరువాత తల్లి మరో వివాహం చేసుకున్న అనంతరం ఉదయభానుకు సరిగ్గా ఆదరణ లేక తన జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదురుకోవడం కూడా జరిగిందట.
అయినప్పటికీ ఆమె కెరియర్ ఎక్కడ ఆగకుండా తనకున్న టాలెంట్ తో దూసుకుపోతూనే వచ్చింది. టెలివిజన్ షోలో సక్సెస్ పొందిన ఉదయభాను అనేక చిత్రాలలో కూడా నటించింది. 2010 లో వచ్చిన లీడర్ సినిమాలో రాజశేఖర అనే సాంగ్ ఎంత సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.
ఇలా తన కెరియర్ కొనసాగుతూ ఉన్న తరుణంలోనే ఎన్నో కాంట్రవర్సీలకు లోనయ్యింది ఉదయభాను. అన్నిటిని తన మనోధైర్యంతో అధిగమించి తలెత్తుకుంది. ఉదయభాను కొన్ని రోజులకు విజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ళ ఇద్దరిదీ ప్రేమ వివాహం. విజయ్ ది విజయవాడ. ఉదయభాను ఒకసారి విజయవాడలో ప్రైవేట్ షో కి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని చెప్పింది. విజయ్ కు విజయవాడలో సినిమా థియేటర్స్ లు ఉన్నాయట. తన కుటుంబ సభ్యులకు కూడా ఉదయభాను అంటే చాలా మమకారమని తెలిపాడు. కొన్ని సమస్యల కారణంగా ఉదయభానుని ఆర్య సమాజంలో వివాహం చేసుకోవాల్సి వచ్చిందని వివరించాడు. ఆ టైంలో తన కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారని విజయ్ చెప్పాడు.
పెళ్లి అయినా కొత్తలో వాళ్లిద్దరూ చాలా కష్టాలు పడ్డామని కానీ ఇప్పుడు దేవుడి దయవల్ల జీవితంలో అన్నీ లభించాయని తెలిపింది. అయితే తన భర్త గురించి మంచిగా చెబుతూ ఎమోషనల్ అయ్యి ఏడ్చేసింది ఉదయభాను.
ప్రస్తుతానికి తన ఇద్దరి కవల పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. తరువాత కొన్ని రోజుల తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించడం కూడా జరిగింది. మళ్లీ కెరియర్ సక్సెస్ కావాలని, టాలెంట్ ఉన్నవాళ్లు ఎక్కడ ఆగకూడదని చెప్పుకుంటు వచ్చింది.