తమిళ నటుడు విజయ్ దళపతి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రాలు ఇవే!

విజయ్ దళపతి తమిళ సినీ నటుడు. ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా సుపరిచితం. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకడుగా ప్రసిద్ధి చెందాడు. 1984లో తన తండ్రి ఎస్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన వెెట్రీ సినిమా ద్వారా బాల నటుడుగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

1992లో తన తండ్రి ఎస్. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన నాలయ తీర్పు ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక వరుస అవకాశాలతో ముందుకు వెళుతున్న విజయ్ కు 1996లో పువే ఉనక్కగ చిత్రం కెరియర్ ను మలుపు తిప్పింది. ఇక అప్పటినుండి తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని వరుస అవకాశాలతో తమిళ ఇండస్ట్రీలోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక అసలు విషయం ఏంటంటే విజయ్ కెరియర్ ను మలుపు తిప్పి స్టార్ గా నిలబెట్టిన చిత్రాలు ఏంటో చూద్దాం.

సర్కారు: ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద 2018లో విడుదల అయ్యింది. దాదాపుగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది.

విజిల్: అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదల అయింది. ఈ చిత్రంలో డబల్ రోల్ పాత్రను పోషించాడు విజయ్. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 290 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ప్రపంచ దేశాలలోనే మంచి రెస్పాన్స్ సాధించిన చిత్రమిది.

మాస్టర్: విజయ్ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2021 లో విడుదల అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 150 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

విజయ్ కు తమిళంలోనే కాక తెలుగు రాష్ట్రాలలో కూడా ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. తమిళ ఇండస్ట్రీ స్టార్ లలో రజనీకాంత్ తర్వాత విజయ్ అన్నట్లుగా మంచి గుర్తింపు పొందాడు.

ఇక ఈ 2022లో ఇతను నటించిన బీస్ట్ చిత్రం విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒక సినిమాకు సంత