గాడ్ ఫాదర్ లో నటించిన సముద్రఖని నిజజీవితంలో పడ్డ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

సముద్రఖని తెలుగు సినీ నటుడు, దర్శకుడు. ఈయన తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించాడు. 1998 లో కే. విజయన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం జరిగింది.

ఇక 2001లో పార్ధాలే పరవశం సినిమా ద్వారా నటుడిగా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2003లో ఉన్నై చరణదాఇందెన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. ఇక వరుస అవకాశాలతో తెలుగు తమిళ మలయాళంలలో ఒకపక్క నటుడుగా చేస్తూ మరొకవైపు దర్శకత్వంలో కూడా తన సత్తా చాటుకున్నాడు.

అయితే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఇతను నిజజీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఈయనకు రావడం జరిగింది. ఈయన ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించాడు.

చిన్నప్పటినుండి సినిమాలు అంటే చాలా ఇష్టం. తండ్రికి తెలియకుండా దొంగతనంగా సినిమాలు చూసేవాడు. ఒకసారి సినిమాలలో నటించాలి అని ఆసక్తితో ఇంట్లో నుంచి వెళ్లి అవకాశాలు దొరకకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఆ సమయంలో తండ్రి చదువు అయిపోయాక సినిమాలలో నటించు అని చెప్పడం జరిగింది.

దురదృష్టవశాత్తు నెల రోజుల సమయంలోనే తండ్రి గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఇక ఇతని తల్లి బి ఏ వరకు చదివించింది. సినిమాలలో నటించాలని ఆసక్తి చూసి రెండు వేల రూపాయలు అప్పు తెచ్చి ఇతని చేతిలో పెట్టిందట. ఇక మద్రాసులో సినిమా అవకాశాల కోసం ఇతను చేయని ప్రయత్నాలు లేవట.

చివరకు ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట. దారి మధ్యలో ఒక వ్యక్తి ఇతనిని గమనించి ఎందుకు బాధపడుతున్నావు. ఎవరికి ఎవరు సహాయం చేయరు మనమేంటో మనమే నిరూపించుకోవాలి అని చెప్పడం జరిగిందట. ఇక కథలు రాయడం మొదలుపెట్టి నటుడుగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించడం జరిగింది.

ఇక ఈ తెలుగులో శంభో శివ శంభో, జెండాపై కపిరాజు చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది. రఘువరన్ బీటెక్ లో తన నటనకు గుర్తింపు పొంది వరస సినిమా అవకాశాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు.