భర్త వ్యక్తిత్వం గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన రంభ..!

నటి రంభ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన అందంతో ఫేమస్ అయిన రంభ ఇప్పుడు సినిమాలకు దూరమైన అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు. అప్పుడప్పుడు టీవీ షోలలో రంభ హల్చల్ చేస్తూ ఉంటుంది. రంభ 1976 లో విజయవాడలో జన్మించారు. ఈమె అసలు పేరు విజయలక్ష్మి.

ఇ వి వి సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా ఈమెకు ఎంతగానో గొప్ప పేరు తెచ్చింది. తరువాత ఏడు భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు అందరూ అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.

తెలుగులో ఈమె ఎక్కువగా చిరంజీవి గారి సరసన నటించడం జరిగింది. అల్లుడా మజాకా, బావగారు బాగున్నారా, హిట్లర్ సినిమాలు ఈమెకు ఎంతగానో గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. అయితే ప్రస్తుతం సినిమాలలో అవకాశాలు తగ్గడం ద్వారా 2010లో మలేషియా కు చెందిన పారిశ్రామికవేత ఇంద్రన్ పద్మనాధన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు సంతానం.

ఒక ఇంటర్వ్యూలో భాగంగా రంభ తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ తనది పెద్దలు కుదిర్చిన వివాహం, తన అన్నకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా వ్యక్తికి ఈమె భర్త వాళ్ళ ఫ్యామిలీ కూడా పరిచయం ఉంది. తన భర్తను మొదటిసారి కలిసినప్పుడు ఇంద్ర అనే పేరు మొదటి నుంచి ఉందా లేదా మధ్యలో మార్చుకున్నారని అడిగిందట అప్పుడు ఆయన ఏకంగా తన పాస్పోర్ట్ ని చూపించాడు అని చెప్పింది.

తన భర్త ఫ్యామిలీలో ఐదవ వ్యక్తి. భర్త చిన్నగా ఉన్నప్పుడే తండ్రి చనిపోవడం జరిగింది. అప్పటినుంచి ఆమె అత్త మొదటి కొడుకు దగ్గరే ఉందట. ఇక పెళ్లి అయ్యాక సినిమాలు చేయాలా వద్దా అంటే నీ ఇష్టం అని తనను బాగా సపోర్ట్ చేశాడు అని చెప్పుకొచ్చింది. ఇష్టముంటే బిజినెస్ రంగంలోకి రావచ్చని చెప్పాడు అంది.

కానీ ఈమెకు బిజినెస్ అంటే ఇష్టం లేదు అందుకు భర్త కూడా ఏమాత్రం బలవంతం చేయలేదు. ఇక అత్తగారైతే సొంత కూతురిగా చూసుకుంటుంది. భర్త కూడా నువ్వు ఏమి చేయాలనుకుంటే అదే చెయ్యి అంటూ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అని పేర్కొంది. ఇక స్నేహితుల విషయానికొస్తే తనకు ఎవరు స్నేహితులు లేరని సౌందర్య అంటే ఇష్టమని చెప్పింది. మొత్తానికి రంభ సినిమాలను దూరమై ఫ్యామిలీ బాధ్యతలు చూస్తూ సంతోషంగా గడుపుతుందని తెలుస్తుంది.