Pan World Heroine: సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న పాన్ వరల్డ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Pan World Heroine: మొదట మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అతి తక్కువ సమయంలోనే తన అందం,అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో పాటుగా, స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అలా ఉత్తరాది భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 100కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు మన తెలుగింటి ఆడపడుచు రంభ. ఒకప్పుడు ఈ పేరు వింటే చాలు యువత ఎగ్జిట్ అవుతూ సినిమా థియేటర్ల ముందు క్యూ కట్టేవారు.

తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, బోజ్‌పురి, ఆంగ్లం మొదలగు 8 భాషల్లో నటించి అప్పట్లోనే పాన్‌ వరల్డ్‌ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. దాదాపుగా రెండు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా రాణించింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరం అయింది రంభ. అయితే ఆమె చివరిగా తమిళంలో 2010లో విడుదల అయినా పెణ్‌ సింగం అనే చిత్రంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు. తర్వాత 2010లో కెనడాకు చెందిన ఇంద్ర కుమార్‌ పద్మనాధన్‌ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాలలో నటించింది రంభ. ఇక చివరిగా 2017 లో ఆమె నటనకు దూరమైంది. అయితే 49 ఏళ్ల రంభ ఇప్పుడు చెన్నైకి మకామ్‌ మార్చి మళ్లీ సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.

ఇప్పుడు మళ్లీ నటించాలా, నిర్మాతగా చిత్రాలు నిర్మించాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు చిత్ర నిర్మాణం ప్రారంభించి త్రీ రోజెస్‌ అనే చిత్రాన్ని నిర్మించారన్నది తెలిసిందే. కానీ, ఆ చిత్రం రంభను నిరాశపరచింది. కొందరు దర్శకులు మాత్రం రంభ నిర్మించే చిత్రాలకు పనిచేయాలని ఆశపడుతున్నట్లు టాక్‌. కారణం ఆమె భర్త వేల కోట్లకు అధిపతి కావడమేననే టాక్‌. ఇకపోతే ఒక తమిళ చిత్రంలో పార్థిబన్‌, రంభ కలిసి నటించారు. అలా షూటింగ్‌ కు వచ్చిన ఆమెను చూసిన పార్థిబన్‌ తో పాటు తదితర సినీ ప్రముఖులు రంభ సార్‌ అంటూ ఆమెను తెగ అభిమానిస్తూ చుట్టుముట్టేశారు. అలాంటి రంభ ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అవుతున్నారట. అయితే హీరోయిన్ రంభ ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఆమె క్యారెక్టర్ ఏంటి? ఎలాంటి పాత్రలో నటించబోతున్నారు ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి. అయితే రంభ రీ ఎంట్రీ ఇస్తున్నారు అన్న విషయం తెలియడంతో అభిమానులు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.