విలన్ పాత్రలలో కనిపించే నాగభూషణం నిజ జీవితం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు!

నాగభూషణం తెలుగు సినిమా, రంగస్థల నటుడు. చెప్పే డైలాగులకు క్లాప్స్ కొట్టించగల ఘనత ఈయనకు కలదు. ఈయన 1921లో ప్రకాశం జిల్లా, అనకర్లపూడి లో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న ఈయనకు ఆర్థిక పరిస్థితులు వెంటాడాయి దానితో ఉద్యోగం చేయవలసి వచ్చింది.

సెంట్రల్ కమర్షియల్ సూపర్డెంట్ ఆఫీసులో పాతిక రూపాయల జీతంతో ఉద్యోగం రావడంతో కుటుంబమంతా మద్రాసు చేరిపోయారు. 1941లో వివాహం చేసుకున్నారు ఆయన భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నారు. ఇక 1952లో పల్లెటూరు చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస అవకాశాలతో 1990 వరకు కొనసాగారు. సినిమాలలో కన్నింగ్ విధంగా తన మాటలతోనే హీరోకు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించేవారు.

ఫైటింగ్లకు దూరంగా కేవలం తన మాటలలోనే విలనిజని చూపించి, చివరలో హీరోకు కావలసింది ఇచ్చేసి కేవలం రెండు మూడు దెబ్బలకు తోనే సన్నివేశాన్ని రక్తి కట్టించేవారు. దాదాపు అప్పట్లో ఈయన నటించని సినిమాలు అరుదుగా కనిపించేవి. ప్రతినాయక పాత్రలో ఈయన తర్వాతే ఎవరైనా అనే విధంగా ఉంటుంది నాగభూషణం నటన. అటు సినిమాలలోనూ, రంగస్థలం మీద ఏకకాలంలో బిజీ స్టార్ అనిపించుకున్న ఏకైక నటుడు నాగభూషణం.

ఒక్క రక్త కన్నీరు నాటకానికే దాదాపుగా రెండువేల ప్రదర్శనలు ఇచ్చారు. బిజిస్టార్ కాకముందు ఒకే నెలలో 30 ప్రదర్శనలు, ఒకే రాత్రి రెండు ప్రదర్శనలు ఇవ్వగలిగిన ఘనత నాగభూషణానికే దక్కుతుంది. ప్రముఖ నటిమనులు వాణిశ్రీ, శారద మొదట్లో ఈయన నాటక బృందంలోనే ఉండేవారు. అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

సాంగ్స్ అండ్ డ్రామా కమిటీలో సలహా సంఘ సభ్యునిగా, సినీ కళాకారుల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన వ్యక్తిగా ఈయనకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రక్త కన్నీరు నాటక ప్రదర్శన ద్వారా దేశవ్యాప్తంగా 25 సంవత్సరాల పాటు 300 మంది కళాకారులకు అన్నం పెట్టింది. తెరమీద హీరో వేషాలతో అడుగడుగునా విఫలమై తరువాత విలన్ గా రాణిస్తూ నిజ జీవితంలో ఈయన హీరో అనే చెప్పుకోవాలి.