హీరోయిన్ మాధవి లత జీవితంలో ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు!

మాధవి లత తెలుగు సినిమా నటి. తెలుగు, తమిళ భాషల్లో నటించింది. ఈమె 1988లో కర్ణాటకలోని హుబ్లీలో జన్మించింది. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా. తండ్రి రైల్వే ఉద్యోగి కావడం వల్ల హుబ్లీలో ఉండేవారు. ఆమె కర్ణాటకలోని గుల్బర్గాలో గ్రాడ్యుయేషన్, మైసూర్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.

ఇక మాధవి లత 2008లో విడుదలైన నచ్చావులే అనే రొమాంటిక్ చిత్రం ద్వారా తెలుపు తెరకు పరిచయమైంది. ఆమె తన పాత్రలో ఆశాజనకంగా ఉందని ఒక విమర్శకుడు వివరించాడు. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్ లో కోవేంటి విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ చదివింది. ఆ తరువాత వరుసగా ష్.., స్నేహితుడా, ఉసురు, చూడాలని చెప్పాలని, అరవిందు 2 లాంటి చిత్రాలలో నటించడం జరిగింది.

2015లో తమిళంలో అంబాల చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మాధవి లత, మహేష్ బాబు నటించిన అతిధి చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. TNR కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, మాధవి లత తన వ్యక్తిగత జీవితం, తన కెరీర్ సమస్యలను సుదీర్ఘంగా చర్చించింది. తాను మొదటి సినిమా చేస్తున్నప్పుడే సహనటుడు తనతో డేటింగ్ చేయాలని కోరితే, తాను నిరాకరించిందని పేర్కొంది.

ఆమె నటించిన మొదటి సినిమా దర్శకుడు తనతో కాస్టింగ్ కౌచ్ ప్రయత్నించాడు, తాను తిరస్కరించడం వలన తన కెరీర్ నాశనం అవ్వడానికి ప్రయత్నించాడని మరియు ఆమెకు ఎక్కువగా ఆఫర్లు రాకపోవడానికి అతనే కారణం అయ్యుండొచ్చు అని పేర్కొంది. పదేళ్లుగా తనను, తన కుటుంబాన్ని ఒకరు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక 2018లో మాధవి భారతీయ జనతా పార్టీలో చేరింది. ఆమె 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాజకీయాలలో రాణించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.