నటి ప్రగతి భర్త గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

ప్రగతి ఒక తెలుగు సినీనటి. ఈమె తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. ఈమె 1969 లో హైదరాబాదులో జన్మించింది. తన చిన్నతనం అంత మద్రాస్ లో కొనసాగింది. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లికి సాయంగా ఉండేందుకు కార్టూన్ పాత్రలకు గాత్ర దానం చేసేది.

ప్రగతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకునే రోజుల్లోనే చెన్నైలోని మైసూర్ సిల్క్ ప్యాలెస్ వారి ప్రకటనలలో కనిపించింది. ఆ ప్రకటన చూసినా ఒక తమిళ దర్శకుడు కే. భాగ్యరాజ్ తన సినిమా వీట్ల విశేషంగాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు తర్వాత రెండు సంవత్సరాల పాటు తమిళంలో ఏడు సినిమాలలో నటించింది. ఒక మలయాళం చిత్రంలో కూడా నటించింది.

తర్వాత వివాహం చేసుకొని మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ నటించడం ప్రారంభించింది. పలు టీవీ సీరియల్లలో, సినిమాలలో నటించింది. ఈవేళ సినిమాలో హీరోకు తల్లిగా నటించినందుకు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకుంది. ఏ పాత్రలో అయినా చక్కగా ఇమిడిపోయి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసి ప్రేక్షకుల మెప్పు పొందింది.

ఇక తన భర్త విషయానికి వస్తే ఇంట్లో ఏ విషయంలోనైనా గొడవ జరిగితే భర్త సైలెంట్ గా ఉంటాడని, తానే ఎక్కువ గొడవ పడడం జరుగుతుందని ఒక ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది. తన భర్తది సున్నితమైన మనస్వత్వమని, ఎక్కువగా సైలెంట్ గా ఉంటాడని, ఏ పనికైనా అడ్డు చెప్పడు అని పేర్కొంది.

ఇలాంటి భర్త దొరకడం తన అదృష్టమని, తన ప్రోత్సాహం ద్వారానే వివాహం తర్వాత కూడా సినిమాలలో నటిస్తున్నానని, ఇంట్లో చిన్న గొడవను కూడా గయాలితనంగా తానే గొడవ పడతుందని చెప్పింది. మొత్తానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలో ముందుకు రాణిస్తుంది ప్రగతి.