నటి సౌందర్య మరణంతో కుటుంబంలో ఎలాంటి కలహాలు ఏర్పడ్డాయో తెలుసా!

సౌందర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో వందకు పైగా చిత్రాలలో నటించింది. దాదాపు 12 సంవత్సరాల పాటు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. 1971లో కర్ణాటకలోని కొల్లారు జిల్లాలో జన్మించింది. ఈమెకు ఒక తమ్ముడు అమరనాథ్ ఉన్నాడు. 1992లో తన తండ్రి స్నేహితుడు గాంధర్వ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు.

ఆ తరువాత అమ్మోరు సినిమాలో అవకాశం వచ్చి మంచి పేరు, గుర్తింపు లభించింది.ఈమె అసలు పేరు సౌమ్య సినిమాలలో వచ్చిన తర్వాత సౌందర్యగా పేరు మార్చుకుంది. తెలుగు పరిశ్రమలో అగ్ర హీరోయిన్లలో ఒకరు సౌందర్య. విక్టరీ వెంకటేష్ తో నటించిన రాజా, జయం మనదేరా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం వంటి చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ఆ చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వారిద్దరూ తెలుగు పరిశ్రమలో విజయవంతమైన జంటగా పేరు తెచ్చుకున్నారు. సౌందర్య అందాల ప్రదర్శనకి బద్ద వ్యతిరేకి. ఆమె ఎన్నో అవార్డులను పురస్కారాలను సొంతం చేసుకుంది. 2003లో తన మేనమామ, బాల్య స్నేహితుడు అయిన జి ఎస్ రఘును పెళ్లి చేసుకుంది. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.

తరువాత ఈమె భారతీయ జనతా పార్టీ తరఫున 2004లో బెంగుళూరు నుంచి కరీంనగర్ వెళుతుండగా మధ్యలో విమానం క్రష్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ ప్రమాదంలో తమ్ముడు అమర్నాథ్ కూడా చనిపోవడం చాలా బాధాకరం. సినీ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. తరువాత ఈమె కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. సోదరుడి భార్య నిర్మలకు, భర్త కు, తన తల్లికి మధ్య వివాదాలు పెరిగి చివరికి కోర్టును ఆశ్రయించారు.

కొంతకాలం తర్వాత ఆస్తి పంపకాలు చేసుకున్నట్టు సమాచారం. ఆమె కన్నడలో నటించిన చివరి చిత్రం ఆప్తమిత్ర. ఈ చిత్రం మంచి విజయం సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్థం సౌందర్య స్మారక పురస్కారం ను కర్ణాటక ఆంధ్ర లలిత కళ సమితి వారు ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజు ఉత్తమ నటిమనులకు బహుకరిస్తారు. ఈమె తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉంటుంది.