బింబిసార దర్శకుడు ముందు హీరో అని మీకు తెలుసా?

మల్లిడి వశిష్ట్ నటుడు, దర్శకుడు. ఇతని అసలు పేరు మల్లిడి వేణు. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ తనయుడు. ఇక అసలు విషయానికి వస్తే, హీరోలు దర్శకులుగా మారడం లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ ఒకే ఒక సినిమాలో హీరోగా నటించి తరువాత దర్శకుడుగా మారడం అంటే కాస్త ఆసక్తికరమే కదా.

అందులోనూ హీరోగా చేసిన సినిమాకు.. దర్శకుడుగా చేసిన సినిమాకు మధ్య 16 సంవత్సరాలు గ్యాప్ ఉంటే.. చాలా ఆసక్తిగా విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలి అనిపిస్తుంది. చాలా గ్యాప్ తీసుకుని సినిమాకు దర్శకత్వం వహించడం అంటే అదేమీ చిన్న విషయం కాదు. తొలిసారిగా డైరెక్షన్ చేసిన వశిష్ట్ గతంలో ఒక సినిమాలో హీరోగా నటించడం జరిగింది.

2006లో కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా అనే సినిమాలో హీరోగా నటించడం జరిగింది. కులశేఖర్ వంటి రచయిత దర్శకుడిగా ఒక సినిమాను చేశారంటే, ఆ సినిమాపై భారీగానే అంచనాలు ఉండేవి. కానీ సినిమా విడుదల తర్వాత సరైన స్పందన లభించలేదు. దాంతో చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తరువాత దర్శకుడుగా మారి బింబిసార సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. నటుడుగా గుర్తింపును పొందలేకపోయిన వశిష్ట్ దర్శకుడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చాలామంది నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మొదటి సినిమాతో హీరోగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు దూరమైన వశిష్ట్ దర్శకుడిగా మొదటి సినిమాతోనే సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడంటూ.. ఆయన చాలా గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక చాలా రోజులుగా హీరో కళ్యాణ్ రామ్ కూడా సక్సెస్ కోసం సరైన కథ కావాలని ఎదురుచూస్తున్న సమయంలో బింబి సార సినిమా ఇటు హీరోకు.. అటు డైరెక్టర్ కు బాగానే కలిసి వచ్చిందని తెలుగు ఇండస్ట్రీలో టాక్.